మీ పక్కనోళ్లకంటే మీకే చలి ఎక్కువ పెడుతోందా? అయితే మీకు ఈ సమస్యలున్నట్టే..!

First Published Jan 1, 2023, 12:58 PM IST

వేరేవాళ్లకంటే మీకే ఎక్కువ చలి పెడుతుందని ఎప్పుడైనా అనిపించిందా? నిజానికి ఇలా మీకే చలి ఎక్కువగా పెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే..
 

చలికాలంలో చలిపెట్టడం సర్వ సాధారణం. అయితే అందరికి ఒకలా... మీకు మాత్రం ఇంకా ఎక్కువగా చలిపెట్టినట్టు ఎప్పుడైనా అనిపించిందా? దీనికి కొన్ని కారణాలు చాలానే ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఐరన్ లోపం

మీకు చల్లగా అనిపించడానికి ఇనుము లోపం కూడా ఒక కారణమేనంటున్నారు నిపుణులు. ఇనుము లోపం రక్తహీనతకు దారితీస్తుంది. శరీరం కణజాలాలకు ఆక్సిజన్ ను తీసుకెళ్లడానికి మన శరీరానికి తగినంత ఎర్ర రక్త కణాలు అవసరం. ఇవి లోపించినప్పుడు రక్తహీనత సమస్య వస్తుంది. ఇది అలసట, బలహీనత, చల్లగా ఉన్న అనే లక్షణాలను కలిగిస్తుంది.
 

విటమిన్ బి -12 లోపం

విటమిన్ బి -12 లేదా ఫోలిక్ ఆమ్లం వంటి విటమిన్ లోపాలు కూడా రక్తహీనతకు కారణమవుతాయి. దీనివల్ల ఎక్కువగా చల్లగా అనిపిస్తుందని కొందరు నమ్ముతారు. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బి -12  చాలా అవసరం. అయితే ఫోలిక్ ఆమ్లం..  డిఎన్ఎ, ఇతర జన్యు పదార్ధాల ఉత్పత్తికి కూడా అవసరం.
 

రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం

రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కూడా ఎక్కువ చలి పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీరం రక్త ప్రసరణ ప్రభావితం అయినప్పుడు.. మన శరీర అవయవాలకు, కణజాలాలకు రక్తం సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల శరీరం చల్లగా అనిపించడం మొదలవుతుంది. ఇరుకైన ధమనులు లేదా రక్త ప్రవాహాన్ని దెబ్బతీసే ఇతర సమస్యల వల్ల ఇలా అవుతుంది. 
 

శరీరంలో నీటి కొరత

పై సమస్యలే కావు శరీరంలో తగినంత నీరు లేకపోతే కూడా శరీరం చల్లగా ఉందన్న భావన కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మెరుగైన రక్త ప్రసరణకు నీరు చాలా చాలా అవసరం. శరీరంలో నీరు లేకపోవడం వల్ల  రక్తహీనత, రక్త ప్రవాహం బలహీనపడటానికి దారితీస్తుంది.

ఇవి మాత్రమే కాదు.. థైరాయిడ్ సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, వయస్సు, శరీర కూర్పుతో సహా ఎన్నో సమస్యలు ఇతరుల కంటే ఎక్కువ చలి పెట్టడానికి కారణమవుతాయి. 
 

థైరాయిడ్ సమస్యలు

హైపోథైరాయిడిజం సమస్య ఉంటే కూడా ఇతరుల కంటే మరీ చల్లగా అనిపిస్తుంది. ఈ హైపోథైరాయిడిజం మీ శరీర జీవక్రియ మందగించడానికి, చల్లగా ఉన్న భావనలకు దారితీస్తుంది. అతి చురుకైన థైరాయిడ్ గ్రంథి, లేదా హైపర్ థైరాయిడిజం కూడా చల్లగా ఉన్న భావనలను కలిగిస్తుంది. ఎందుకంటే ఇది జీవక్రియ పెరుగుదలకు కారణమవుతుంది. అలాగే శరీరంలో వేడి ఉత్పత్తిని పెంచుతుంది.
 

దీర్ఘకాలిక అనారోగ్యాలు

డయాబెటిస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి. చల్లగా ఉన్న భావాలను కలిగిస్తాయి.

click me!