చలికాలంలో క్యారెట్ జ్యూస్ ను తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

First Published Dec 1, 2022, 12:48 PM IST

క్యారెట్లలో బీటా కెరోటిన్, లుటిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా పోగొడుతాయి. 
 

చలికాలంలో ఎక్కడ లేని రోగాలన్నీ మనకే చుట్టుకునే అవకాశం ఉంది. ఈ సీజన్ లో దగ్గు, జ్వరం, జలుబు, డెంగ్యూ, మలేరియా వంటి ఎన్నో రోగాలు వస్తుంటాయి. ఎందుకంటే చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ బలంగా ఉంటే ఎన్నో రోగాలొచ్చే ప్రమాదం తగ్గుతుంది. అందుకే ఈ సీజన్ లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడే ఆహారాలను తినడం మంచిది. ఇలాంటి ఇమ్యూనిటీని పెంచే కూరగాయల్లో క్యారెట్ ఒకటి. చలికాలంలో క్యారెట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ కాలంలో క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే ముప్పు తప్పుతుంది. క్యారెట్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, బయోటిన్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది

శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే ఎన్నో రోగాలు వస్తయ్. అయితే క్యారెట్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ఇతర విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. చలికాలో  క్యారెట్ జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. 
 

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది

బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుకోవడం అంత సులువు కాదు. అయితే క్యారెట్లు ఇందుకు బాగా ఉపయోగపడతాయి. క్యారెట్లలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిను నియంత్రించడానికి క్యారెట్ జ్యూస్ రోజూ తాగొచ్చు. 
 

గుండె ఆరోగ్యానికి మంచిది

క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఈ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యారెట్లలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇధి రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. అలాగే ఈ క్యారెట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా సహాయపడతాయి.
 

కంటిచూపునకు మంచివి

క్యారెట్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటిచూపుకు చాలా అవసరం. అందుకే క్యారెట్ జ్యూస్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడుతుంది డాక్టర్లు చెప్తుంటారు.  క్యారెట్లు బీటా కెరోటిన్, లుటిన్ వంటి పోషకాలకు గొప్ప మూలం. ఇవన్నీ కళ్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి.
 

చర్మ ఆరోగ్యానికి మంచివి

క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ సి,  ఇతర యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే క్యారెట్లు మీ చర్మాన్ని ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా మారుస్తాయి. మచ్చలను, మొటిమలను కూడా తొలగిస్తాయి. ఇవి చర్మానికి మంచి రంగును ఇస్తాయి కూడా.. 

click me!