happy chocolate day 2024 : ఈ రోజు మీ ప్రేయసితో కలిసి డార్క్ చాక్లెట్ ను తిన్నారంటే..!

First Published Feb 8, 2024, 3:48 PM IST

happy chocolate day 2024 : వాలెంటైన్ వీక్ లో మూడో రోజు  చాక్లెట్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజు ప్రేమికులు ఒకరికొకరు చాక్లెట్లను ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే డార్క్ చాక్లెట్ ను గనుక మీరు తిన్నారంటే ఏమౌతుందో తెలుసా? 

happy chocolate day 2024 : వాలెంటైన్ వీక్ లో రోజ్ డే అయిపోయింది. ప్రపోజ్ డేలు ఈ రోజు. రేపు చాక్లెట్ డేను సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రోజున రిలేషన్ షిప్ లో ఉన్నవారు తమ భాగస్వాముల కోసం టేస్టీ టేస్టీ చాక్లెట్లను కొని గిఫ్ట్ గా ఇస్తుంటారు. ఈ స్వీట్ మీ బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా చేయడమే కాకుండా మీ ఇద్దరి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది తెలుసా? అవును డార్క్ చాక్లెట్ ను తింటే ఎన్నో రోగాలకు మీరు దూరంగా ఉంటాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. రేపు చాక్లెట్ డే కాబట్టి.. డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

గుండెకు మేలు..

డార్క్ చాక్లెట్లలో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి సిరలు, ధమనులు మెరుగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. ఇది స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండే చాక్లెట్లను తినడం మంచిది కాదు. అలాగే డార్క్ చాక్లెట్లను కూడా మోతాదులోనే తినాలి. 
 

Latest Videos


మెమోరీ పవర్ మెరుగుదల

డార్క్ చాక్లెట్లలో కోకో సారాలు ఉంటాయి. ఇవి ఫ్లేవనోల్స్ ను కలిగి ఉంటాయి. ఈ ఫ్లేవనోల్స్ మీ మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మెమోరీ పవర్ ను కూడా పెంచుతాయి. డార్క్ చాక్లెట్ ను రోజూ కొద్ది మొత్తంలో తింటే మతిమరుపు వచ్చే అవకాశం తగ్గుతుంది. 
 

Image: Getty Images

మానసికి స్థితికోసం..

డార్క్ చాక్లెట్లు గొప్ప యాంటీ డిప్రెసెంట్లు. ఎన్నో అధ్యయనాల ప్రకారం.. డార్క్ చాక్లెట్లు మీ మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి. ఇది మీ మానసిక స్థితిని పెంచే రసాయనం. ఈ రసాయనాన్ని ఎక్కువగా యాంటీ డిప్రెసెంట్ ముందుల్లో ఉపయోగిస్తారు. అందుకే మీ మూడ్ బాలేనప్పుడు లేదా మానసికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు చిన్న డార్క్ చాక్లెట్ ముక్కను తినండి. 
 

వ్యాయామానికి సహాయం

మీకు తెలుసా? మన రోజువారి వ్యాయామానికి కూడా డార్క్ చాక్లెట్లు ఎంతగానో సహాయపడతాయి. అవును రోజూ చిన్న ముక్క డార్క్ చాక్లెట్ ను తింటే మీరు మీ రోజువారి వ్యాయామాలను సులువుగా చేయగలుగుతారు. డార్క్ చాక్లెట్ లో ఎపికాటెచిన్ అనే ఫ్లేవనోల్ ఉంటుంది. ఇది మీకు బలాన్ని ఇస్తుంది. ఇది మీ శరీర ద్రవ్యరాశిని నిర్మించడానికి కూడా సహాయపడుతుంది.
 

కొలెస్ట్రాల్ అదుపులో

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. డార్క్ చాక్లెట్ కూడా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గి మీ గుండె సేఫ్ గా ఉంటుంది

click me!