అవాంఛిత రోమాలు చాలా ఇబ్బంది పెడతాయి. వాటిని తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. లోషన్లు, వ్యాక్సింగ్, స్క్రబ్స్ ఇలా ఎన్నో సాధనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ హెయిర్ రిమూవల్ స్క్రబ్స్ ను రెగ్యులర్ గా వాడుతుండాలి. లేకపోతే అవాంఛిత రోమాలు ఇబ్బందిగా మారతాయి. అయితే రసాయనాలతో కూడిన హెయిర్ రిమూవల్ స్క్రబ్స్ ను తరచుగా వాడడం వల్ల చర్మం సున్నితత్వాన్ని కోల్పోతుంది.
కొంతమందికి అండర్ ఆర్మ్స్, పెదాల మీద మీసకట్టులా అవాంఛిత రోమాలు ఉంటాయి. ఇది చాలామందిలో కనిపిస్తుంది. అయితే మరికొంతమందిలో శరీరం మొత్తం వెంట్రుకలు ఉంటాయి. అవి తేలిగ్గా గుర్తుపట్టేలా కూడా ఉంటాయి. దీనివల్ల పొట్టి డ్రెస్సులు వేసుకోవాలన్నా.. కాస్త ఫ్యాషన్ గా తయారు కావాలన్నా ఇబ్బందిగా మారుతుంది.
natural scrub
మరి వీటి నుంచి విముక్తి ఎలా అంటే.. వైద్యచికిత్స తీసుకోవడం ఒక పద్ధతి అయితే...ఇంట్లోనే ఈ వెంట్రుకలను తొలగించే పద్దతుల్ని పాటించడం మరో పద్ధతి.
ఇంట్లో అనగానే చాలామంది రేజర్ అనుకుంటారు. ఎక్కువమంది అవాంఛిత చర్మాలను తొలగించుకోవడానికి ఉపయోగించే తేలికైన, తక్కువ ఖర్చుతో కూడిన విధానంగా దీన్ని వాడతారు. అంతేకాదు తక్కువ టైంలో అయిపోతుంది. కూడా... అయితే ఇలా రేజర్ వాడడం వల్ల అవాంఛిత రోమాలు తొలిగిపోవడం నిజమే కానీ.. చర్మం మొద్దుబారే అవకాశం ఉంటుంది. కొత్త హెయిర్ మరింత వేగంగా పెరిగే అవకాశమూ లేకపోలేదు.
దీనికోసం ఇంట్లోనే ఈజీగా స్క్రబ్ ను తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు అందుబాటులో ఉండేవే. మరి స్ర్కబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలేంటంటే.. చక్కెర, నిమ్మకాయ, బంగాళదుంప, ఎర్రపప్పు. ఇవన్నీ సాధారణంగా ప్రతీ వంటింట్లోనూ దొరికేవే..
sugar
నాలుగు క్యూబ్ ల చక్కెర లేదా మూడు టేబుల్ స్పూన్ల చక్కెర, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసం, ఐదు టేబుల్ స్పూన్ల బంగాళదుంప రసం, ఐదు టేబుల్ స్పూన్ల ఎర్రపప్పు వీటన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. చాలా మెత్తగా పేస్ట్ అయ్యేవరకు చేయాలి.
lentil
ఈ పేస్ట్ ను అవాంఛిత రోమాలున్న ప్రాంతంలో అప్లై చేసి 20 నిమిషాల ఉంచాలి. పూర్తిగా ఎండిపోయాక కడిగేయాలి. ఇలా ప్రతీరోజూ చేయాలి. చర్మం మీద గట్టిపడి జుట్టును ఊడిపోయేలా చేస్తుంది. ఇక బంగాళా దుపం బ్లీచింగ్ లా ఉపయోగపడుతుంది. దీనివల్ల జుట్టు రంగుమారి తేలిగ్గా అవుతుంది.