అల్లంతో ఆరోగ్యమే కానీ అధికంగా తింటే ఈ తీవ్రమైన సమస్యలు వచ్చే ఛాన్స్

Published : Aug 30, 2025, 12:34 PM IST

అల్లం ఒక అద్భుతమైన ఔషధం. కానీ ఏది ఎక్కువ తినడం మంచిది కాదు. అతి అనర్ధానికే దారితీస్తుంది. అందుకే అల్లాన్ని అధికంగా తిన్నా కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. 

PREV
15
అల్లం వల్ల ఉపయోగాలు

అల్లం భారతీయ వంటలలో కనిపించే ముఖ్యమైన పదార్థం. టీ నుంచి బిర్యానీ వరకు అల్లం తరుగు పడాల్సిందే. అప్పుడే ఒక భిన్నమైన రుచి వస్తుంది. అలాగే అల్లంతో ఎంతో ఆరోగ్యం కూడా. అల్లాన్ని ఆయుర్వేదంలో ఒక ఔషధంగా చెబుతారు. జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గించడంలో అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచడంలో అల్లం ముందుంటుంది. అలాగే జీర్ణవ్యవస్థను కాపాడడంలో కూడా అల్లంలో ఉండే సమ్మేళనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అల్లం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

25
అల్లం అతిగా తింటే

అతి అనర్ధానికి దారితీస్తుందని అంటారు పెద్దలు. అల్లం తినడం వల్ల ఆరోగ్యమే.. అలాగని అతిగా తింటే మాత్రం అది ఎన్నో అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ప్లమేషన్ గుణాలు ఎక్కువ. అందుకే అల్లాన్ని అధికంగా తింటే రక్తం పలుచబడి పోయే అవకాశం ఉంది. అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారించాయి. ఒక అధ్యయనం చెబుతున్న ప్రకారం అల్లంలో ఉండే సమ్మేళనాలు ప్లేట్ లెట్లు గడ్డకట్టకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ లాంటి వ్యాధుల ప్రమాదం పెరిగిపోతుంది. అలాగే గాయాలు తగిలినప్పుడు రక్తస్రావం కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే మీరు రక్తాన్ని పలుచబరిచే మందులు అంటే ఆస్పిరిన్ వంటివి తీసుకుంటుంటే అల్లాన్ని చాలా తక్కువగా తీసుకోవాలి.

35
అధ్యయనాలు చెప్పే విషయాలు

అన్నం తినడం వల్ల జీర్ణవ్యవస్థకు, జీర్ణ క్రియకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగని అధికంగా తీసుకుంటే మాత్రం సమస్యలు మొదలవుతాయి. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ చెబుతున్న ప్రకారం అల్లం అధికంగా తింటే కొంతమందిలో గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. విరేచనాలు అవుతాయి. గుండెల్లో మంట ఎక్కువైపోతుంది. ముఖ్యంగా సున్నితమైన పొట్ట లైనింగ్ ఉన్నవారికి అల్లం అధికంగా తినడం ఏ మాత్రం మంచి పద్ధతి కాదు.

అల్లంలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎండోక్రనాలజీ అండ్ మెటబాలిజంలో ప్రచురించిన ఒక పరిశోధన చెబుతున్న ప్రకారం అల్లం రక్తంలో చక్కెర లేదా రక్తపోటును నియంత్రించే మందులతో కలిపి సరిగా పనిచేయలేదు. అంటే మీరు డయాబెటిస్ లేదా హై బీపీ మందులను తీసుకుంటున్నప్పుడు అల్లాన్ని చాలా తక్కువ తీసుకోవాలి. లేకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోయి హైపోగ్లైసిమియా అనే పరిస్థితికి దారితీస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.

45
అల్లంతో అలర్జీ

అన్నం తినడం వల్ల కూడా అలెర్జీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి అల్లం సరిపడదు. అల్లంతో చేసిన ఆహారాలు తిన్న వెంటనే చర్మంపై తేలికపాటి దద్దుర్లు వస్తున్నా, శ్వాస అందక ఇబ్బంది పడుతున్నా... అల్లం మీకు పడడం లేదని అర్థం చేసుకోవాలి. అల్లం వల్ల మీకు ఏదైనా అలెర్జీ అనిపిస్తే వెంటనే దానిని ఆపేయండి. అలాగే వైద్యున్ని ఒకసారి సంప్రదించి మీ సమస్యను చెప్పి తగిన చికిత్స తీసుకోండి.

55
గర్భం ధరించాక

గర్భిణీ స్త్రీలు ఏవి పడితే అవి తినకూడదు. చాలామంది గర్భం ధరించాక ఉదయం పూట వికారం, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అలాంటప్పుడు అల్లంతో చేసిన ఆహారాలను తినమనే సలహా ఎక్కువగా వినిపిస్తుంది. ఇది కొంతవరకు ఉత్తమంగానే పనిచేస్తుంది. కానీ అధికంగా తీసుకుంటే మాత్రం సమస్యలు మొదలవుతాయి. గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ చెబుతున్న ప్రకారం అధిక అల్లం వినియోగం గర్భస్రావానికి దారితీస్తుంది. లేదా పిండం అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి అల్లాన్ని మితంగానే తీసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories