ఆకాశంలో మరికొన్ని రోజుల్లోనే అద్భుతం జరగబోతోంది. అరుదైన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. భారతదేశంలోని ఎన్నో నగరాల నుంచి ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. దాదాపు 82 నిమిషాల పాటు ఈ చంద్రగ్రహణం ఉంటుంది.
చంద్రగ్రహణం అనేది ఒక ఖగోళ అద్భుతం. సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం అన్నింటికంటే ఎంతో భిన్నమైనది. చూసేందుకు చంద్రుడు నారింజ రంగులో ప్రకాశిస్తూ అందంగా కనిపిస్తాడు. అలా 22 నిమిషాల పాటు అద్భుతంగా ప్రకాశిస్తాడు. అందుకే దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు.
25
చంద్రగ్రహణం సెప్టెంబరులో
సెప్టెంబర్ 7 రాత్రి ఏర్పడబోయే ఈ చంద్రగ్రహణం కేవలం మనదేశంలోనే కాదు.. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల్లోని దేశాల్లో కూడా స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. వాతావరణం అనుకూలిస్తే హైదరాబాద్, లక్నో, చండీగఢ్, కోల్కతా, ఢిల్లీ అన్ని ప్రాంతాల నుంచి ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. దీన్ని చూసేందుకు మీరు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇది ఒక అరుదైన అద్భుతమైన గ్రహణం.
35
ఏ సమయంలో
సెప్టెంబర్ 7వ తారీకు రాత్రి 8:58 నిమిషాలకు పాక్షిక గ్రహణం మొదలవుతుంది. 9:57 నిమిషాలకు మొత్తం గ్రహణం ప్రారంభమవుతుంది. అలా రాత్రి 11:41 నిమిషాల వరకు గ్రహణం ఏర్పడి ముగుస్తుంది. మరుసటి ఉదయం వరకు పాక్షిక గ్రహణం కొనసాగుతుంది. అంటే సెప్టెంబర్ 8వ తారీఖున పాక్షిక గ్రహణం కొనసాగి ముగుస్తుంది. రాత్రి 9 గంటల దాటాక 11 గంటల్లోపు చంద్రుని వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి. ఆ సమయంలో చంద్రుడు అద్భుతంగా మెరిసిపోతూ కనిపిస్తాడు.
సంపూర్ణ చంద్రగ్రహణం ఒక గంటా 22 నిమిషాల పాటు కొనసాగుతుంది. అంటే చాలాసేపు మీరు గ్రహణాన్ని చూసే అవకాశం ఉంటుంది. భారతదేశం అంతటా చంద్రుడిని చూసేందుకు ఎంతో మంది సిద్ధమవుతున్నారు. కొందరు టెలిస్కోపులను కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఆ అద్భుత దృశ్యాన్ని ఫోటోలు తీసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతాయి. మనదేశంలోని ప్రతి ప్రాంతం నుంచి ఈ గ్రహణం కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆకాశం నిర్మలంగా ఉంటే చిన్న చీకటిలో చంద్రుడు అందంగా కనిపిస్తాడు. మెట్రో నగరాలు నగరాల్లో రాత్రి కూడా ఎక్కువగా లైట్లు అధిక కాంతితో వెలుగుతూనే ఉంటాయి. అలాంటి వారి కన్నా గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారే దీన్ని చూడగలరు.
55
చంద్రగ్రహణం అంటే ఏమిటి?
చంద్రగ్రహణం అంటే సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుకుంటుంది. అంటే సూర్యునికి చంద్రునికి మధ్యకు భూమి వెళ్లినప్పుడు ఇది ఏర్పడుతుంది. చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే ఒక ఖగోళ సంఘటన ఇది. దీన్ని పౌర్ణమి అని పిలుస్తారు. భూమిపై ఉన్న వారికి చంద్రుడు సరిగా కనిపించకపోవడం లేదా మసకబారుతాడు. ఈ సమయంలో సూర్యుడు భూమి చంద్రుడు ఒకే సరళరేఖలోకి వస్తారు. భూమి.. సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉంటుంది.