నాచుతో బట్టలు.. ఇప్పుడిదే ఫ్యూచర్ ఫ్యాషన్ ట్రెండ్..

First Published May 18, 2021, 1:55 PM IST

ఫ్యాషన్ లో కొత్త ఆవిష్కరణలు, వింత పోకడలు మామూలే... అలాంటిదే ఇప్పుడొక కొత్త ఆవిష్కరణ పురుడుపోసుకుంది. అదే భవిష్యత్తులో నాచుతో త్రీడీ ప్రింటింగ్ బట్టలు అందుబాటులోకి రానున్నాయి.

ఫ్యాషన్ లో కొత్త ఆవిష్కరణలు, వింత పోకడలు మామూలే... అలాంటిదే ఇప్పుడొక కొత్త ఆవిష్కరణ పురుడుపోసుకుంది. అదే భవిష్యత్తులో నాచుతో త్రీడీ ప్రింటింగ్ బట్టలు అందుబాటులోకి రానున్నాయి.
undefined
దీనికి సంబంధించిన ఓ ఉత్కంఠభరితమైన ఆవిష్కరణను, నెదర్లాండ్స్‌లోని రోచెస్టర్ యూనివర్సిటీ, డెల్ఫ్ట్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుల బృందం కనిపెట్టింది.
undefined
ఈ పరిశోధనకు సంబంధించిన అంశాలు అడ్వాన్స్‌డ్ ఫంక్షనల్ మెటీరియల్స్ అనే జర్నల్‌లో ప్రచురించబడ్డాయి.త్రీ డైమెన్షియల్ ప్రింటింగ్ అనేది ఓ శక్తివంతమైన టెక్నాలజీ. ఆల్గేలాంటి జీవం ఉన్న పదార్థంతో మనుషులు వాడే దుస్తులు తయారు చేయడం మామూలు విషయం కాదు.
undefined
దీనికోసం మొదట బ్యాక్టీరియా నుంచి వేరు చేసిన నాన్ లివింగ్ బ్యాక్టీరియల్ సెల్యూలోజ్ తో ఫొటో సింథసిన్ మెటీరియల్ తయారు చేశారు. దీంట్లో ఫ్లెక్సిబిలిటీ, టఫ్ నెస్, స్ట్రెంథ్, ఎలాంటి ఆకారంలోకైనా మారిపోయే లక్షణం, పిండిగా, నలిపినా ఎలా చేసినా పాడుకాని లక్షణాలు వీటి ప్రయోగానికి ఉసిగొలిపాయి.
undefined
త్రీడీ ప్రింటింగ్ లో బ్యాక్టీరియల్ సెల్యులోజ్ పేపర్ లా పనిచేస్తే.. లివింగ్ మైక్రోఆల్గే ఇంకులా పనిచేస్తుంది.ఇలా లివింగ్, నాన్ లివింగ్ సమ్మేళనంతో తయారయ్యే ఈ మెటీరియల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీంతోపాటు ఎకో ఫ్రెండ్లీ, బయో డిగ్రేడబుల్ కూడా.
undefined
వీటివల్ల ఆరోగ్యానికి మంచిదని.. ఆల్గేలోని కిరణజన్య సంయోజనక్రియ చేసుకునే తత్వం వల్ల చాలా కాలంపాటు ఈ దుస్తులు ఆకుపచ్చగా ఉంటాయి.
undefined
ఆల్గే నుంచి తయారు చేసిన బయో-గార్మెంట్స్ ప్రస్తుత వస్త్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తాయి. కొన్ని ప్రతికూల పర్యావరణ ప్రభావాలను పరిష్కరిస్తాయి. ఈ పద్ధతిలో తయారయ్యే హై క్వాలిటీ బట్టలు తయారవుతాయి. అంతేకాదు ఎక్కువ కాలం మన్నే బయోడిగ్రేడబుల్ గా ఉంటాయన్నారు.
undefined
అంతేకాదు ఈ నాచు బట్టలు గాలిలో కార్బన్ డయాక్సైడ్ ను తగ్గిస్తాయి. ఫోటో సింథసిస్ ప్రక్రియ ద్వారా గాలిని శుద్ధి చేస్తాయి.ఇప్పుడు వాడుతున్న బట్టల్లా పదే పదే శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల నీటి వాడకం తగ్గుతుంది.
undefined
ఈ దుస్తుల తయారీకి వాడే జీవ పదార్థాలు నీరు, పోషకాలు లేకుండా చాలా రోజులు జీవించగలవు, అంతేకాదు ఈ పదార్థాన్ని కొత్త జీవన పదార్థాలను పెంచడానికి ఒక విత్తనంగా ఉపయోగపడతాయి... అని బయోనానోసైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ మేరీ-ఈవ్ అన్నారు.
undefined
అందుకే ఈ దుస్తుల్ని మారుమూల ప్రాంతాలలో, అంతరిక్షంలో జీవజాలాన్ని వృద్ధి చేయడానికి ఉపయోగపడతాయి.
undefined
click me!