వానలు పడుతున్నప్పుడు ఈ పండ్లను తినకూడదు, తింటే అనారోగ్యమే

Published : Oct 29, 2025, 04:58 PM IST

Fruits: వానలు జోరుగా పడుతున్నాయి. వర్షాలు పడుతున్నప్పుడు కొన్ని రకాల పండ్లు తినకూడదు. వాటిని వర్షాకాలంలో తింటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. ఆ పండ్లేమిటో తెలుసుకోండి.

PREV
17
వానాకాలంలో పండ్లు తినవచ్చా?

వర్షాకాలంలోనే జ్వరాలు, వ్యాధులు వంటివి త్వరగా దాడి చేస్తాయి. ఈ సీజన్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. వానలు పడుతున్నప్పుడు కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలి. వాటి వల్ల లాభాలు కన్నా నష్టాలే ఎక్కువ. పండ్లు ఆరోగ్యకరమే కానీ వానలు పడుతున్నప్పుడు మాత్రం వాటిని తినకూడదు. 

27
పండ్లు ఎందుకు తినకూడదు?

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వర్షాకాలంలో మాత్రం కొన్ని పండ్లు తినడం వల్ల నష్టమే జరుగుతుంది. అవి ఆరోగ్యానికి మేలు చేయడానికి బదులుగా హాని కలిగిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ నీటిశాతం ఉన్న  పండ్లు త్వరగా పాడైపోతాయి. దీనివల్ల వాటిలో బ్యాక్టీరియా, పురుగులు పెరిగే అవకాశం ఉంది. వాటిని తింటే అజీర్తి, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, ఫుడ్ పాయిజనింగ్ లాంటి సమస్యలు వస్తాయి. 

37
పుచ్చాకయ

వేసవిలో పుచ్చకాయ, కర్బూజ  తినడం మంచిది. కానీ వర్షాకాలంలో వాటిని తినడం అంత మంచి పద్ధతి కాదు. నిజానికి ఈ పండ్లు వేసవి కోసమే. అయినా కూడా నిల్వ చేసి మరీ వాటిని అన్ని కాలాల్లో అమ్ముతూ ఉంటారు. అవి తేమను ఎక్కువగా పీల్చుకుని త్వరగా పాడైపోతాయి. కాబట్టి వీటిని తింటే పొట్ట సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. 

47
బెర్రీ జాతి పండ్లు

వర్షాకాలంలో బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటి బెర్రీ జాతి  పండ్లను దూరంగా ఉంచాలి. అవి త్వరగా పాడైపోతాయి. వాటిపై బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాటిని తింటే జీర్ణ సమస్యలు వస్తాయి.

57
మామిడి పండ్లు

వర్షాకాలంలో మామిడిపండు ఏమాత్రం తినకూడదు. అవి వేసవిలో తినాల్సిన పండ్లు. కానీ కొందరు నిల్వ చేసి ఈ కాలంలో కూడా అమ్ముతారు. మామిడిపండుకు వేడి చేసే గుణం కలిగి ఉంటుంది. వర్షాకాలంలో దీన్ని తింటే కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్, అజీర్తి, కడుపు భారంగా ఉండటం వంటివి కలుగుతాయి.

67
పనస పండు

వానాకాలంలో పనసపండు తినడం మంచి పద్ధతి కాదు. ఈ పండులో చక్కెర అధికంగా ఉంటుంది. వానల్లో వీటిని తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం వస్తాయి.

77
పైనాపిల్

పైనాపిల్‌లో సహజంగానే పుల్లగా ఉంటుంది. దీనిలో ఆమ్లత్వం అధికం. వర్షాకాలంలో ఈ పండును  తింటే జలుబు, దగ్గు అధికంగా వస్తాయి. అలాగే ఎసిడిటీ, పొట్ట సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ.

Read more Photos on
click me!

Recommended Stories