బంగాళ దుంపతో ఫేస్ మాస్క్...
కావాల్సిన పదార్థాలు..
1మీడియం సైజు బంగాళ దుంప, పావు కప్పు దానిమ్మ గింజలు, కొద్దిగా పాలు, నిమ్మరసం( జిడ్డు చర్మం ఉన్నవారు)
ఫేస్ మాస్క్ తయారీ విధానం...
ముందుగా బంగాళదుంపను నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత దీనిని తొక్క తీసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను, దానిమ్మ గింజలను కూడా కలిపి మిక్సర్ లో వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఈ పేస్టులో పచ్చి పాలు కూడా కలపాలి. మీది జిడ్డు చర్మం అయితే.. నిమ్మరసం జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచాలి. అది చల్లగా మారిన తర్వాత.. ముఖంపై అప్లై చేయాలి. దానిని సర్కిల్ రూపంలో మసాజ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండు, మూడు సార్లు అప్లై చేస్తే చాలు. మీ ముఖం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. బంగాళదుంప లోని సహజ ఎంజైమ్ లు డెడ్ స్కిన్ సెల్స్ తొలగించడంలో కూడా సహాయపడతాయి.