అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Published : Oct 29, 2025, 04:42 PM IST

వంటింట్లో వాడే ముఖ్యమైన పదార్థాల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి. ఇది వంటలకు రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కానీ త్వరగా పాడవుతుంటుంది. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
15
అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ చిట్కాలు

కూర, సాంబార్‌, బిర్యానీ, చట్నీ.. ఏ వంటకం అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా పూర్తవదు. కానీ ఈ పేస్ట్ తయారు చేసిన కొన్ని రోజుల్లోనే రంగు మారిపోతుంది. దుర్వాసన వస్తుంది. లేదా పూర్తిగా చెడిపోతుంది. అప్పుడు దాన్ని పారేయడం తప్ప ఇంకేం చేయలేము. కానీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్టును ఎక్కువకాలం తాజాగా ఉంచుకోవచ్చు. 

25
సరైన నిష్పత్తి

చాలామంది “కొంచెం ఎక్కువ వెల్లుల్లి వేస్తే బాగుంటుంది” లేదా “అల్లం ఎక్కువగా వేయాలి” అని అనుకుంటారు. కానీ ఈ అసమాన నిష్పత్తి వల్ల పేస్ట్ త్వరగా పాడవుతుంది. కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని సరైన నిష్పత్తిలో తయారు చేయడం మంచిది. అంటే 100 గ్రాముల అల్లం అయితే, 100 గ్రాముల వెల్లుల్లి వేయాలి. ఇలా చేస్తే పేస్ట్ రుచిగా ఉంటుంది. పేస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు నీళ్లు వేయకూడదు. దానివల్ల నిల్వ కాలం తగ్గుతుంది. 

35
ఉప్పు, నూనె ఉపయోగం

అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ కాలం పెరగడంలో ప్రధాన పాత్ర పోషించేది ఉప్పు, నూనె. ఉప్పు సహజ ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుంది. అలాగే నూనె బ్యాక్టీరియా పెరగకుండా కాపాడుతుంది. పేస్ట్ తయారు చేసిన తర్వాత కొద్దిగా రీఫైన్ చేసిన నూనె లేదా నువ్వుల నూనె కలపండి. కొందరు ఆలివ్ ఆయిల్‌ కూడా ఉపయోగిస్తారు. ఇది పేస్ట్‌ను ఆక్సిడైజ్ అవకుండా కాపాడుతుంది.

45
నిల్వ విధానం

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను ఎప్పుడూ గాజు లేదా స్టీల్ కంటైనర్లోనే నిల్వ చేయాలి. ప్లాస్టిక్ కంటైనర్లు వాసనను ఆకర్షించి పాడవ్వడానికి కారణమవుతాయి. పేస్ట్ తీసుకోవడానికి ఎప్పుడూ పొడిగా ఉన్న స్పూన్ వాడాలి. తడి స్పూన్ వాడితే నీరు కలిసిపోతుంది. దానివల్ల పేస్ట్ త్వరగా పాడవుతుంది. అలాగే పేస్ట్ తీసుకున్న తర్వాత కూడా గాలి తగలకుండా మూత గట్టిగా పెట్టాలి. 

55
ఫ్రీజ్ చేయడం

పెద్ద మోతాదులో పేస్ట్ తయారు చేస్తే, దాన్ని ఫ్రీజ్ చేయడం ఉత్తమ మార్గం. ఐస్ ట్రేలలో పేస్ట్ వేసి ఫ్రీజ్ చేయవచ్చు. అవి గట్టిపడిన తర్వాత జిప్‌లాక్ కవర్‌లో వేసి నిల్వ చేయాలి. అవసరమైనప్పుడు ఒక క్యూబ్ తీసుకుని నేరుగా వంటలో వాడుకోవచ్చు. ఈ విధంగా చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 నెలల వరకు తాజాగా ఉంటుంది.

సహజ ప్రిజర్వేటివ్స్ 

కొంతమంది రసాయన ప్రిజర్వేటివ్స్ వాడతారు. కానీ సహజంగా కూడా పేస్ట్ నిల్వ కాలాన్ని పెంచే చిట్కాలు ఉన్నాయి. పేస్ట్ తయారు చేసే సమయంలో కొద్దిగా పసుపు పొడి లేదా నిమ్మరసం కలపండి. పసుపులో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వల్ల పేస్ట్ పాడవకుండా కాపాడుతుంది. అలాగే నిమ్మరసం రుచి, రంగు, సువాసన నిలుపుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories