రాత్రి 7 దాటిన తర్వాత ఈ ఆహారాలను అస్సలు తినకండి.. తిన్నారో మీ పని అంతే..

First Published Aug 10, 2022, 4:00 PM IST

మనం తినే ఫుడ్ పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయితే రాత్రి ఏడు గంటల తర్వాత కొన్ని ఆహారాలను అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పోషకాహారంతోనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యం బాగుండాలన్నా.. చెడిపోవాలన్నా మనం తినే ఆహరంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే రాత్రి ఏడు గంటల తర్వాత కొన్ని రకాల ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం..రాత్రిపూట తేలికపాటి ఆహారాన్నే తినాలి. అలా అయితేనే జీర్ణక్రియ బాగుంటుంది. హాయిగా నిద్రపడుతుంది. అయితే రాత్రిపూట కొన్ని ఆహారాలను తినకూడదు.. ఎందుకు తినకూడదు.. తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
 

బిర్యానీ (Biryani)

చికెన్ బిర్యానీ కానీయండి.. మటన్ బిర్యానీ కానీయండి.. వీటిని మాత్రం రాత్రి ఏడు దాటిన తర్వాత అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో కొవ్వు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. చిన్న మటన్ బిర్యానీ ప్యాకెట్ లో 500-700 కేలరీలు ఉంటాయి. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు దీనివల్ల నిద్రకూడా సరిగ్గా పట్టదు. అందుకే రాత్రి ఏడు దాటిన తర్వాత బిర్యానీలను తినడం మానుకోండి.
 

స్పైసీ ఫుడ్ (Spicy food)

ఇండియన్ ఫుడ్ లో మసాలా దినుసులు ఖచ్చితంగా ఉంటాయి. అసలు మసాలా దినుసులు లేకుండా వంటలే పూర్తికావు. అయితే రాత్రిపూట ఇలాంటి మసాలా ఫుడ్ ను తినడం వల్ల గుండెల్లో విపరీతమైన మంట పుడుతుంది. అంతే కాదు ఇలాంటి వంటకాలను ఎక్కువ నూనె, నెయ్యితో తయారు చేస్తారు. దీనివల్ల గుండె సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అందుకే మరీ కారంగా.. ఘాటుగా ఉన్న ఆహారాలను రాత్రి ఏడు తర్వాత తినకండి. 
 

స్వీట్లు (Sweets)

స్వీట్లను కూడా రాత్రి ఏడు తర్వాత అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ స్వీట్లు నిద్రకు భంగం కలిగిస్తాయి. రాత్రి భోజనం తర్వాత స్వీట్లను తింటే అవి తొందరగా అరగవు. అంతేకాదు ఇవి మిమ్మల్ని హుషారుగా చేస్తుంది. అంతేకాదు స్వీట్లను తినడం వల్ల మీకు రాత్రంతా నిద్ర ఉండదు. 
 

పకోడీ (Pakoda)

పకోడీని చూడగానే ఎవ్వరికైనా నోట్లో నీళ్లు ఊరుతాయి. ఎంత నోరూరించినా పకోడీలను రాత్రి ఏడు గంటల తర్వాత అస్సలు తినకూడదు. ఎందుకంటే ఇది కడుపులో చికాకును కలిగిస్తుంది. అలాగే నిద్రను పాడుచేస్తుంది. ఎందుకంటే పకోడీలను నూనెలో వేయించడం వల్ల ఆమ్ల స్వభావం కలిగి ఉంటాయి. మీరు రాత్రిపూట అధిక ఆమ్లాలను కలిగున్న ఆహారాలను తింటే అవి అంత తొందరగా జీర్ణం కావు. దీనివల్ల మీకు రాత్రిపూట నిద్ర ఉండదు.

కాఫీ (Coffee)

తక్షణ శక్తిని ఇచ్చేందుకు కాఫీ, టీ, గ్రీన్ టీ లు బాగానే ఉపయోగపడతాయి. కానీ వీటిని రాత్రి పూట తాగడం వల్ల నిద్రపై ఎఫెక్ట్ పడుతుంది. ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇలాంటి పానీయాలను సాయంత్రం 6 గంటల తర్వాత తాగడం మానుకోవాలి. వీటికి బదులుగా చిన్న చాక్లెట్ ముక్కను గానీ.. కొద్దిగా ఫ్రూట్ జ్యూస్ ను గానీ తాగండి. ఇవి కాఫీని తాగాలన్న కోరికలను తగ్గిస్తాయి.

click me!