ఈ సమయంలో పైనాపిల్ ను అసలే తినొద్దు

First Published Dec 8, 2022, 2:48 PM IST

పైనాపిల్ లో ఉండే బ్రోమలైన్ అనే ఎంజైమ్ శ్వాసకోశ సమస్యలను నివారిస్తుంది. రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయినప్పటికీ.. 
 

పైనాపిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పండు బరువు తగ్గడానికి,  జీర్ణక్రియను మెరుగుపర్చడానికి సహాయపడటంతో  పాటుగా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. పైనాపిల్ లో విటమిన్ సి, విటమిన్ ఎ లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పైనాపిల్ లో 22 గ్రాముల పిండి పదార్ధం, 2.3 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అలాగే మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం లు కూడా పుష్కలంగా ఉంటాయి. 

పైనాపిల్లో ఉండే 'బ్రోమెలైన్' అనే సమ్మేళనం శరీరంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. అలాగే తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి తోడ్పడుతుంది. ఆయుర్వేదంలో.. పైనాపిల్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పైనాపిల్ ను తినడానికి సరైన సమయం ఏంటి? ఎప్పుడు ఈ పండును తినకూడదో తెలుసుకుందాం.. 

పైనాపిల్ ను తినడం వల్ల మలబద్ధకం, మూత్రపిండాల వ్యాధులు, యుటిఐ, జ్వరం, అజీర్ణం, పిఎంఎస్, బహిష్టు మలబద్ధకం, పొత్తికడుపు నొప్పి, కామెర్లు నయమవుతాయి. ఈ సమస్యలొచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. జీర్ణక్రియ, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వంటి సమస్యలతో బాధపడేవారికి పైనాపిల్ చాలా మంచిది. దీనిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి కొల్లాజెన్ ను ఉత్పత్తి చేయడానికి, నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. ఇది చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. 

పైనాపిల్లోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ శ్వాసకోశ సమస్యలను నివారించడానికి, సైనస్ కుహరాలలో శ్లేష్మం పేరుకుపోవడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును తగ్గించడానికి ,గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

pineapple

పైనాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు, అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు,  బ్రోమెలైన్ వంటి ఎంజైమ్లు ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఈ పండును తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మంటను తగ్గిస్తుంది.

పైనాపిల్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ.. దీనిని ఉదయం పరిగడుపున తినడం అస్సలు మంచిది కాదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే ఇది ఎసిడిటీని కలిగిస్తుంది.పైనాపిల్ తినడానికి ఉత్తమ సమయం ఉదయం 10 నుంచి 11 గంటలకు లేదా సాయంత్రం 4 నుంచి 5 గంటలు. 

click me!