భారతీయ మహిళలు కాళ్ళకు మెట్టెలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

First Published Jan 12, 2022, 2:14 PM IST

 హిందూ సంప్రదాయం (Hindu tradition) ప్రకారం భారతీయ మహిళలు కాళ్ళకు మెట్టెలు (Stairs) ధరిస్తారు. ఇలా పెళ్లైన మహిళలు కాళ్ళకు మెట్టెలు ధరించడం అనేది పూర్వకాలం నుంచి మన పెద్దలు ఆచరిస్తున్న సాంప్రదాయం. మన పెద్దలు ఏ ఆచారాన్ని పాటించిన అది ఆరోగ్యపరమైన అంశానికి కూడా చెంది ఉంటుంది. అయితే ఇప్పుడు మనం భారతీయ మహిళలు కాళ్ళకు మెట్టెలు ఎందుకు ధరించాలో తెలుసుకుందాం..
 

చాలా మంది మహిళల్లో మెట్టెలు ఎందుకు ధరించాలి అని సందేహం (Doubt) కలుగుతోంది. అయితే ఈ తరం అమ్మాయిలకు ఇలాంటి సందేహాలు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. కాలికి పెట్టుకున్న మెట్టెలను చూడగానే ఆ మహిళకు పెళ్లి అయిందని తెలుస్తుంది అంతే కదా దానితో ప్రయోజనం (Purpose) ఏంటి అని చాలామంది అనుకుంటారు.
 

మరి కొందరు మహిళలు పెళ్లయిన తర్వాత కాలికి మెట్టేలను అలంకరణగా (Decoration) మాత్రమే ధరిస్తారు. మరికొందరు పెళ్లయింది కదా పెద్దలు చెప్పినది పాటించాలని పెట్టుకుంటారు. కానీ మెట్టెలు పెట్టుకుంటే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చాలా మందికి తెలియదు. మన పెద్దలు ఏ సంప్రదాయాన్ని మొదలుపెట్టిన అది ఆరోగ్యానికి (Health) సంబంధించి ఉంటుంది.
 

పెళ్లయిన మహిళలకు బొట్టు, గాజులు (Bangles), పువ్వులు (Flowers) ఎంత ముఖ్యమో మెట్టెలు కూడా అంతే ముఖ్యం. మెట్టెలు పెట్టుకున్న మహిళలను ముత్తైదువులుగా భావిస్తారు. అందుకే మెట్టెలు ధరించడం శుభసూచికం, మంగళకరం. ఇవి మహిళల సౌభాగ్యానికి సంకేతం వంటివి. కాలికి మెట్టెలు పెట్టుకున్న మహిళలను పరాయి పురుషులు చెడు దృష్టితో చూడరు. 
 

పెళ్లైన మహిళలు కాలి రెండో వేలికి మెట్టెలు ధరిస్తారు. కాలి రెండో వేలికి ఉన్న ఒక నరం గర్భాశయ నరాలకు (Cervical nerve) సంబంధం కలిగి ఉంటుంది. అది గర్భాశయం ద్వారా గుండెకు (Heart) చేరుతుందని మన పూర్వికులు కనుగొన్నారు. కాబట్టి మెట్టెలు పెట్టుకుంటే కాలికి ఉన్న వేలి నరం పనితీరు బాగుంటుంది. దాంతో గర్భాశయం, ఇతర అవయవాల పనితీరు బాగుంటుందని సైంటిఫిక్ గా నిరూపించారు.
 

కాలికి పెట్టుకున్న మెట్టెలు గర్భాశయ పనితీరును మెరుగుపరిచి రక్త ప్రసరణ (Blood circulation) సజావుగా సాగడానికి సహాయపడతాయి. దీంతో ప్రతి నెల స్త్రీల రుతు చక్రం (Menstrual cycle) సక్రమంగా జరుగుతుంది. గర్భాశయ ఆరోగ్యం మెరుగుపడి, రుతుక్రమం సక్రమంగా ఉంటే గర్భందాల్చడానికి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు. దీంతోగర్భం పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక పెళ్లైన మహిళలు మెట్టెలు ధరించడం మంచిది.
 

కాలికి ధరించే మెట్టెలు వెండివి కావడంతో అది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది భూమి నుంచి ఎనర్జీని (Energy) గ్రహించి శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. సంతాన అభివృద్ధికి, సుఖ ప్రసవానికి అనుకూలమైన నాడులను ఉత్తేజ పరచడానికి మెట్టెలు సహాయ పడతాయి. దీంతో ప్రసవం (Childbirth) సులభంగా జరుగుతుందని మన పూర్వీకులు నమ్మేవారు. కనుక మెట్టెలు ధరించడం పెళ్లయిన మహిళల ఆరోగ్యానికి మంచిది.

click me!