Today Horoscope: ఓ రాశివారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి

First Published May 23, 2024, 5:30 AM IST

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..
 

telugu astrology

23-5-2024,  గురువారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..)

మేషం (అశ్విని  భరణి  కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
కృత్తిక నక్షత్రం వారికి  (దినపతి రాహు)

దిన ఫలం:-అనుకున్న పనులు అనుకూలంగా పూర్తి పూర్తవుతాయి.ప్రయాణాల వలన లాభం చేకూరుతుంది.వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు సాధిస్తారు.నూతన వ్యాపారాలు విషయాల గురించి ఆలోచన చేస్తారు. నూతన పరిచయాలు కలిసి వస్తాయి.గృహంలో సంతోషకరమైన వాతావరణం. దేవాలయాలు సందర్శన చేస్తారు.విద్యార్థులకు అనుకూలం. సంఘంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి రవి)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి.కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందుకు సాగుతారు.కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి.వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృధా ప్రయాస ప్రయాణాలు వలన ఖర్చు అధికమవుతుంది.ఉద్యోగాలలో అధికారులు తో అసంతృప్తి కలుగుతుంది.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర , పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి (దినపతి గురుడు)
పునర్వసు నక్షత్రం వారికి (దినాధిపతి శని)

దిన ఫలం:-రావలసిన బాకీలు వసూలు అవుతాయి. విలాసవంతమైన వస్తువులు కోసం అధిక ఖర్చు చేస్తారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి.అనుకున్న పనులు లో ఆటంకాలు ఏర్పడిన చివరకు పూర్తగును.విందులు  వినోదాల్లో పాల్గొంటారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. భాగస్వామి తోటి ఆనందంగా గడుపుతారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారములు లభించును.మీ వంతు ఇతరులకు సహాయ సహకారాలు అందజేస్తారు.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి (దినపతి కేతువు )
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.శారీరకంగా మానసికంగా సౌకర్యంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు.కుటుంబంలో చక్కటి వాతావరణం ఏర్పడుతుంది.సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.సంతాన అభివృద్ధి మీకు ఆనందం కలిగిస్తుంది.
 

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి బుధుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి శుక్రుడు)
ఉ.ఫల్గుణి  నక్షత్రం వారికి (దినపతి రాహు)

దిన ఫలం:-ఊహించిన విధంగా పనులలో ఆటంకాలు ఏర్పడి చికాకులు గా ఉంటుంది. మానసికంగా బలహీనంగా ఉంటారు.అనవసరమైన ఖర్చులు చేయాల్సి వస్తుంది.వృత్తి వ్యాపారాలు లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.కొత్త ఆదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరును అధికారులు గుర్తిస్తారు. సంతానం విషయంలో ప్రతికూలత ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక ఆలోచన చేస్తారు.సంఘము నందు చేయ వ్యవహారములు తెలివిగా వ్యవహరించాలి.

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి (దినపతి రవి)
చిత్త నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-అనుకున్న పనులు సకాలంలో పూర్తి అగును.నూతన పరిచయాలు లాభం కలిగించును.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగును.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. విలాసవంతమైన వస్తువులు నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు.ఉద్యోగాలలో సహోద్యోగులు నుంచి మంచి సహకారం లభిస్తుంది.పొదుపు పథకాలపై దృష్టి పెడతారు.ప్రయాణాలు కలిసి వస్తాయి.సంఘంలో మీ మాట తీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.కుటుంబసభ్యులతో సంతోషంగా గడుపుతారు.

telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి , విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినపతి గురుడు)
విశాఖ నక్షత్రం వారికి (దినపతి శని) 

దిన ఫలం:-ఉద్యోగాలు ఒడిదుడుకులు ఉంటాయి.అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసరమైన ఆలోచనలు తో సమయాన్ని వృధా గా గడపకండి.దుష్ట కార్యాలకు దూరంగా ఉండాలి.ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ధనం చేకూరును.ఇతరులతో వాదనలకు దూరంగా ఉండటం మంచిది.వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి కేతువు )
జ్యేష్ట నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)

దిన ఫలం:-అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.మానసికంగా బలహీనంగా ఉంటుంది.  ఇతరులతో వాదనకు దూరంగా ఉండాలి.చేయ పనుల్లో ఆవేశంగా కాకుండా నిదానంగా ఆలోచించి చేయండి.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.జీవిత భాగస్వామితో సఖ్యత గా ఉండాలి.వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.చేసే పనుల్లో సూక్ష్మ బుద్ధి తోటి ఆలోచించి చేయవలెను.ఇతరులతో తొందరపాటు మాటలు మాట్లాడవద్దు.

telugu astrology

ధనుస్సు (మూల , పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి  (దినపతి బుధుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రాహు)

దిన ఫలం:-ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.కీలకమైన వ్యవహారాల్లో  జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులన్నీ పూర్తి చేయాలి.ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. ఇతరులతో కొద్దిపాటి కలహాలు రాగలవు.కుటుంబం నందు ప్రతికూలత వాతావరణం.అనవసర ఆలోచనలు తో సమయాన్ని వృధా చేయకండి.
 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినపతి రవి)
ధనిష్ఠ నక్షత్రం వారికి (దినపతి కుజుడు)

దిన ఫలం:-కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.  వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావచ్చు. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి అధికంగా ఉంటుంది.తలపెట్టిన  పనుల్లో ఆటంకాలు ఏర్పడును.ఆధ్యాత్మిక ఆలోచన చేస్తారు.కొన్ని సమస్యలు మానసికంగా బాధ కలిగిస్తాయి.విలువైన వస్తువుల యందు జాగ్రత్త అవసరం.ఇతరుల యొక్క విషయాల్లో జోక్యం చేసుకోవద్దు.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినపతి గురుడు)
పూ.భాద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)

దిన ఫలం:-ఆదాయ మార్గాలు బాగుంటాయి.కుటుంబంలో  సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.విద్యార్థుల ప్రతిభ కనబడుతుంది.కుటుంబంలో శుభకార్య ఆలోచనలు చేస్తారు.వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.కీలకమైన విషయాలు లో ధైర్యంగా ముందడుగు వేయండి.కుటుంబ సభ్యులు మద్దతు మీకు ఉంటుంది.బంధుమిత్రులతో నూతన ప్రయత్నాలు గూర్చి ఆలోచన చేస్తారు.
 

telugu astrology


మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ--దూ- ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి కేతువు )
రేవతి నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)

దిన ఫలం:-ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మానసికంగా ఆందోళన గా ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అకారణంగా గొడవలు ఏర్పడతాయి.పనుల్లో అధిక శ్రమ ఉంటుంది.దుష్ట ఆలోచనలకు దూరంగా ఉండాలి.  అనవసరమైన వాదనకు దూరంగా ఉండటం మంచిది.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.విలువైన వస్తువులు జాగ్రత్త అవసరం.ఆధ్యాత్మిక ఆలోచన చేస్తారు.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

click me!