కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు... కల్కి పై జీరో బజ్ కారణం?

First Published | May 23, 2024, 7:22 AM IST

రామోజీ ఫిల్మ్ సిటీలో కల్కి ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్ ఓ వింతైన కారులో ఎంట్రీ ఇచ్చాడు. ప్రమోషన్స్ కోసం కల్కి టీమ్ భారీగా ఖర్చు చేస్తున్నారు. ఆ స్థాయిలో బజ్ అయితే లేదు 
 

దర్శకుడు నాగ్ అశ్విన్ మొదటి చిత్రం ఎవడే సుబ్రమణ్యం. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కిన ఆ చిత్రం సూపర్ హిట్. రెండో చిత్రం మహానటి. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి బ్లాక్ బస్టర్. తెలుగు, తమిళ భాషల్లో వసూల్ వర్షం కురిపించింది. 

నాగ్ అశ్విన్ మూడు చిత్రం కల్కి 2829AD. ఆయన మామ అశ్వినీ దత్ కల్కి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 27న కల్కి మూవీ విడుదల కానుంది. భారీగా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. నాలుగు నగరాల్లో నాలుగు బడా ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు సమాచారం 


మే 22 రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ వేడుక నిర్వహించారు. కల్కి చిత్రంలో ప్రభాస్ పేరు భైరవ కాగా... ఆయన వాడే వాహనాన్ని పరిచయం చేశారు. ఆ వాహనం పేరు బుజ్జి. అందులోనే ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాడు. వేదిక దద్దరిల్లింది. కల్కి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారులో ప్రభాస్ వచ్చాడు. 

కల్కి ప్రమోషనల్ ఈవెంట్ ఖర్చు రూ. 40 కోట్లు అని సమాచారం. మరో మూడు ఈవెంట్స్ కూడా నిర్వహించనున్నారు. ఇంత చేస్తున్నా కల్కి మూవీపై బజ్ లేదు. ఆ సినిమా గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. ఓపెనింగ్స్ కష్టమే అంటున్నారు. 
 

దీనికి కారణం ప్రభాస్ గత చిత్రాల ఫలితాలే. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నటించిన సాహూ ఆశించిన స్థాయిలో ఆడలేదు. నిజానికి సాహో మూవీలో విషయం ఉన్నా జనాలకు ఎక్కలేదు. రాధే శ్యామ్, ఆదిపురుష్ అయితే డిజాస్టర్స్. ఆ చిత్రాల్లో విషయం లేదు. 

సలార్ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అసలు ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా తక్కువ. ఈ క్రమంలో కల్కి మూవీపై జనాల్లో పెద్దగా ఆసక్తి లేదు. ఇక కల్కి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.. 

Latest Videos

click me!