డయాబెటీస్ పేషెంట్లు మందు తాగితే ఎంత డేంజరో తెలుసా?

First Published Dec 25, 2022, 12:52 PM IST

క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ ను ఇష్టమొచ్చినట్టుగా తాగుతుంటారు. కానీ కొన్ని అనారోగ్య సమస్యలున్న వారు మందును మొత్తమే తాగకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహులు.. 
 

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు, క్రిస్మస్ సందర్భంగా బంధువులు, స్నేహితులతో కలిసి సరదాగా మందు కొడుతుంటే వచ్చే ఆనందం  మాటల్లో చెప్పలేనిది. ఈ మందు పార్టీల వల్ల ఆనందానికి అవదులు ఉండవేమో.. కానీ దీనివల్ల ఆరోగ్యం మాత్రం పక్కాగా దెబ్బతింటుంది. అవును అతిగా మందు కొట్టడం వల్ల శరీర పనితీరు బాగా దెబ్బతింటుంది. కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆల్కహాల్ ను మొత్తమే తాగకూడదు. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు. మధుమేహులకు ఆల్కహాల్ చాలా ప్రమాదకరం. దీనివల్ల వీరి రక్తంలో చక్కెర స్థాయిల బాగా పెరిగిపోతాయి. అంతేకాదు మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. 

alcohol

డయాబెటిస్ ఉన్నవారికి ఆల్కహాల్ ఎందుకు ప్రమాదకరం?

అప్పుడప్పుడు మందు తాగడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. ఇది ఆనందాన్ని కూడా ఇస్తుంది. కానీ దీన్ని రోజూ లేదా తరచుగా తాగితే మాత్రం పాణానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆల్కహాల్లో పిండి పదార్ధాలు, చక్కెరలు ఉంటాయి. అందుకే ఆల్కహాల్ ను తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో మద్యాన్ని తాగడం వల్ల డయాబెటిస్ పేషెంట్ల ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. పార్టీలకు మందును తాగాలనుకుంటే మాత్రం ఒకసారి డాక్టర్  ను ఖచ్చితంగా సంప్రదించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 

Alcohol

ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు

డయాబెటిస్ పేషెండ్లు ఆల్కహాల్ ను అతిగా తాగడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ఇది డయాబెటిస్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని నిపుణులు చెబుతున్నారు. మద్యాన్ని అతిగా తాగడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది.  రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా బాగా పెరుగుతాయి. అలాగే వికారం, ఆకలి పెరగడం, కంటిచూపు మసకబారడం, మాటల్లో తత్తరపాటు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇది దీర్ఘకాలిక సమస్యలను కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

ఆల్కహాల్, డయాబెటిస్ మధ్య సంబంధం ఏంటి

ఆల్కహాల్ ను తాగడం తప్పేం కాదు. కానీ ఒకే సారి ఎక్కువ మొత్తంలో తాగితే మాత్రం ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా పెంచుతుంది. అయినప్పటికీ మీ వైద్యుడి ఒకసారి ఆల్కహాల్ గురించి అడగడం మంచిది. మీ రక్తంలో చక్కెర స్థాయిలు, మీరు తీసుకునే మందులు వంటి వాటిని తెలుసుకుని ఆల్కహాల్ ను తీసుకోవాల్సి ఉంటుంది. లేదా మొత్తమే తాగకుండా ఉండాల్సి వస్తుంది. 

మద్యం తాగే ముందు గుర్తుంచుకోవలసిన విషయాలు

మందును తాగే ముందు కార్బోహైడ్రేట్లు ఉండే తేలికపాటి భోజనం చేయండి. ఇది  రక్తంలో ఆల్కహాల్ శోషణ రేటును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీకు మధుమేహం ఉన్నట్టైతే.. అప్పుడు డయాబెటిస్ ఐడిని తీసుకెళ్లండి. లేదా డయాబెటిస్ ఐడి రిస్ట్ బ్యాండ్ ను ధరించండి. దీనివల్ల మీ మధుమేహ పరిస్థితి గురించి ఇతరులు తెలుసుకుంటారు. అవసరమైనప్పుడు తక్షణ సాయం కూడా పొందొచ్చు. పడుకునే ముందు, మరుసటి రోజు నిద్రలేచిన వెంటనే రక్తంలో గ్లూకోజ్ ను తనిఖీ చేయండి. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తక్కువగా ఉంటే ఏదైనా తినండి. మద్యం సేవించిన మరుసటి రోజు పుష్కలంగా నీటిని తాగండి.
 

click me!