ఈ పండ్లను తింటే డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది.. తప్పక తినండి

First Published Jan 5, 2023, 1:59 PM IST

కొన్ని తీపి పండ్లు షుగర్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిని అమాంతం పెంచేస్తాయి. ఇలాంటి పండ్లను మధుమేహులు తినకపోవడమే మంచిది. అయితే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లను మాత్రం పుష్కలంగా తినొచ్చు. ఈ పండ్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి కూడా. 
 

fruits

మన శరీరం ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా దానిని సరిగ్గా ఉపయోగించలేనప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరిగిపోతాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) ఎక్కువగా ఉండే ఆహారాలలోని కార్బోహైడ్రేట్లు మీ రక్తంలో చక్కెర స్థాయిని త్వరగా ప్రభావితం చేస్తాయి. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే రక్తంలో చక్కెర పెరుగుతుంది. డయాబెటిస్ ను అదుపులో ఉంచడానికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే ఆహారాలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహులు తినగలిగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే పండ్ల  గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

cherry

చెర్రీలు

ఈ చిన్న సైజు పండ్లలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. దీనిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో కేవలం  గ్లైసెమిక్ ఇండెక్స్ 20 యే ఉంటుంది. ఈ పండులో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఈ పండ్లును రోజూ తింటే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీ గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. 
 

నారింజ

నారింజలో గ్లైసెమిక్ ఇండెక్స్ 40 ఉంటుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని అందించడమే కాదు.. మీ ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. నారింజలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండును తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెరిగే అవకాశమే ఉండదు. 
 

స్ట్రాబెర్రీలు

షుగర్ పేషెంట్లకు స్ట్రాబెర్రీలు ఎంత మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిలో ఇతర పండ్ల కంటే చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. స్ట్రాబెర్రీల్లో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. స్ట్రాబెర్రీలలో జిఐ 41 ఉంటుంది. దీనిలో మొత్తం నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది.

apples

యాపిల్స్

రోజుకో యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదంటారు నిపుణులు. ఈ పండు మధుమేహులకు కూడా ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే ఈ పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ 39 ఉంటుంది. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండును తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. డయాబెటీస్ కూడా నియంత్రణలో ఉంటుంది. 
 

pear

పియర్స్

పియర్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండ్లు బరువును తగ్గించడానికి కూడా సహాయపడతాయి. ఈ పియర్స్ పండ్లలో జిఐ 38 ఉంటుంది. మీకు సిఫార్సు చేసిన రోజువారీ ఫైబర్ లో 20% పైగా దీని నుంచే పొందుతారు. ఈ పండు మధుమేహులకు ఎంతో మంచి చేస్తుంది. 

click me!