రోజూ స్నానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published | Mar 3, 2024, 12:30 PM IST

ఏదేమైనా కొంతమంది మాత్రం ప్రతిరోజూ స్నానం చేస్తుంటారు. మరికొంతమంది మాత్రం వారంలో మూడు నాలుగు సార్లు చేస్తుంటారు. ఇంకొంతమంది వారానికి ఒకసారి మాత్రమే చేస్తుంటారు. అసలు ఎన్ని రోజులకోసారి స్నానం చేయాలి? రోజూ స్నానం చేయడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? తెలుసుకుందాం పదండి.
 

భారతీయ సమాజంలో ప్రతిరోజూ స్నానం చేయడం చాలా మంచి అలవాటుగా భావిస్తారు. కానీ కొంతమంది రెగ్యులర్ గా స్నానం చేయడానికి ఇష్టపడితే కొంతమంది మూడు నాలుగు రోజులకు లేదా వారం రోజులకోసారి చేస్తుంటారు. అసలు రోజూ స్నానం చేయాలి? చేయకపోతే ఏమౌతుంది? ఎన్ని రోజులకోసారి స్నానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

యునైటెడ్ స్టేట్స్ లో ప్రతిరోజూ ముగ్గురిలో ఇద్దరు మాత్రమే ప్రతిరోజూ స్నానం చేస్తారట. ఇకపోతే ఆస్ట్రేలియా, భారత్ లల్లో ప్రతిరోజూ 80 శాతం మంది స్నానం చేస్తుంటారట. ఇక చైనా విషయానికొస్తే మొత్తం జనాభాలో దాదాపు సగం మంది వారానికి రెండుసార్లు మాత్రమే స్నానం చేస్తారట. మధ్యప్రాచ్య దేశాల్లో,  ఐరోపాలోని స్కాండినేవియన్ దేశాలలో.. స్నానం చేయడంలో ప్రతి ఒక్కరికీ భిన్నమైన అలవాట్లు ఉన్నాయి.

Latest Videos


అయితే రోజూ స్నానం చేయడం, పరిశుభ్రత అలవాట్లు ప్రతి దేశం స్థలాకృతి, ఆ దేశ వాతావరణం, సంస్కృతిపై ఆధారపడి ఉంటాయి. భారతదేశంలో .. ఆరోగ్యం లేదా పరిశుభ్రతపై ఇంట్రెస్ట్ జనాలను స్నానం చేయడానికి ప్రేరేపించదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యుక్త వయసు నుంచి రోజూ స్నానం చేసే అలవాటు ఉంటుందట. అందుకే మనదేశంలో ప్రతి రోజూ స్నానం చేస్తుంటారు. 

bathing

నిజానికి ప్రతిరోజూ సబ్బు లేదా బాడీ లోషన్ తో స్నానం చేయడం చర్మానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే రోజూ స్నానం చేయకపోయినా కొన్ని భాగాలను మాత్రం క్లీన్ చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. వీటిలో ప్రైవేటు భాగాలు, చంకలు, అవయవాలు, ముఖం, మెడ ఉన్నాయి. వీటిని మనం రోజూ శుభ్రం చేయాలి. 

అయితే ప్రతిరోజూ శరీరాన్ని.. ముఖ్యంగా జుట్టును క్లీన్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులకు ఒకసారి స్నానం చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా వేడినీటి స్నానం చేస్తే రోజూ చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. జుట్టు రాలుతుంది. జుట్టు పొడి బారుతుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. స్కిన్ అలెర్జీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ప్రతిరోజూ స్నానం చేసినా.. శుభ్రంగా లేకపోతే మాత్రం ఇన్ఫెక్షన్లు, అలర్జీలు వస్తాయి. అందుకే ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొందరు సబ్బు, లోషన్ ను అస్సలు వాడరు. ఇలా స్నానం చేయడం వల్ల ఒంటికి అంటుకున్న క్రిములు, దుమ్ము వదలదు. ఇది మిమ్మల్ని రోగాల బారిన పడేస్తుంది. 

చర్మం ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల బ్యాక్టీరియాతో పాటుగా జిడ్డు కూడా అవసరమంటారు నిపుణులు. ఇవన్నీ చర్మంపై సహజంగా ఉంటాయి. కానీ ఎప్పుడూ స్నానం చేసే అలవాటు ఉన్నవారిలో ఇవన్నీ మాయమవుతాయి. ఇది చర్మంపై ప్రభావం చూపుతుంది.

click me!