
ఈ రోజుల్లో చాలా మంది పెర్ఫ్యూమ్ ను రోజూ వాడుతున్నారు. కానీ దీన్ని సరైన పద్దతిలో ఉపయోగించకపోతే గనుక స్కిన్ అలెర్జీ తో సహా ఎన్నో చర్మ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే పెర్ఫ్యూమ్ ను ఉపయోగించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా మంది పర్ఫ్యూమ్ ను స్ప్రే చేసిన తర్వాత బాగా రుద్దుతుంటారు. దీనివల్ల దాని నుంచి వాసన బాగా వస్తుందని అనుకుంటారు. ముఖ్యంగా మణికట్టుపై స్ప్రే చేసి బాగా రుద్దుతుంటారు. కానీ ఇలా రుద్దడం వల్ల సువాసన అణువులు దెబ్బతిని వాసన రావడం తగ్గుతుంది. అంతేకాదు చర్మంపై పెర్ఫ్యూమ్ ను మరీ గట్టిగా రుద్దడం వల్ల గాయాలు అవుతాయి. అందుకే పెర్ఫ్యూమ్ ను స్ప్రే చేసి అలాగే వదిలేయండి.
పెర్ఫ్యూమ్ ను పల్స్ పాయింట్లపై ఉపయోగించేలా తయారుచేస్తారు. కానీ మంచి నాణ్యత ఉన్న పెర్ఫ్యూమ్ ను మాత్రమే వాడాదలి. ఎందుకంటే వీటిలో కెమికల్స్ ఉంటాయి. కాబట్టి సెన్సిటీవ్ స్కిన్ ఉన్నవారు ఆల్కహాల్ ను ఉపయోగించడం మంచిది కాదు. అలాగే ఆల్కహాల్ ఆవిరైపోతుంది కూడా.
అయితే చాలా మంది చంకల్లో కూడా పెర్ప్యూమ్ ను వాడుతుంటారు. కానీ ఇది అండర్ ఆర్మ్ చర్మం సున్నితంగా ఉంటుంది. దీనివల్ల అక్కడ గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే పెర్ఫ్యూమ్ ను శరీరంలోని పల్స్ పాయింట్లలో వాడాలి.
ఇక్కడ రక్త ప్రవాహం ఎక్కువగా జరుగుతుంది. దీనివల్ల మీరు ఇక్కడ పెర్ఫ్యూమ్ ను వాడినా ఎలాంటి సమస్యా రాదు. చెవుల వెనుక భాగం, మణికట్టు, మెడకు రెండు వైపులా, మోకాళ్ల వెనుక భాగం, మోచేతుల లోపల వంటి కొన్ని పల్స్ పాయింట్లపై పెర్ఫ్యూమ్ ను స్ప్రే చేయొచ్చు.
ఆల్కహాల్ పొడిబారుతుంది. సున్నితమైన చర్మం ఉన్నవారికి ఇది మంచిది కాదు. అంటే ఆల్కహాల్ పొడిబారడం వల్ల చర్మంపై దద్దుర్లు రావడం, ఎర్రగా మారడం, అలెర్జీ వంటి సమస్యలు వస్తాయి. మీకు సెన్సిటీవ్ స్కిన్ ఉన్నట్టైతే టెస్ట్ చేయండి. అంటే పెర్ఫ్యూమ్ ను స్ప్రే చేసిన తర్వాత కొంతసేపటి వరకు వేయిట్ చేయండి. ఎలాంటి సమస్య లేదంటే వాడండి. అలెర్జీ లక్షణాలు కనిపిస్తే మాత్రం ఎప్పుడూ వాడకండి. అలాగే పల్స్ పాయింట్లలోనే స్ప్రే చేయండి.
పెర్ఫ్యూమ్ ను ఎక్కువగా ఉపయోగిస్తే..
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పెర్ఫ్యూమ్ ను ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం శ్వాసకోశ సమస్యలు, దురద వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి దీన్ని తక్కువ మొత్తంలోనే ఉపయోగించాలి. సున్నితమైన భాగాల్లో స్ప్రే చేస్తే గనుక అలెర్జీ సమస్యలు వస్తాయి. అలాగే పెర్ఫ్యూమ్ ను నేరుగా శరీరాన్ని స్ప్రే చేయకూడదు. దీన్ని క్లాత్ కు స్ప్రే చేసి లేదా చర్మానికి మాయిశ్చరైజర్ ను వాడిన తర్వాతే ఉపయోగించాలి.
పెర్ఫ్యూమ్ ను ఎక్కడ పడితే అక్కడ పెట్టి ఉపయోగిస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దీనివల్ల పెర్ఫ్యూమ్ చెడిపోతుంది. పెర్ఫ్యూమ్ ను షవర్ కౌంటర్ వంటి వేడి, తేమ ఎక్కువగా ఉండే ప్లేస్ లల్లో పెట్టకూడదు. దీన్ని ఎప్పుడూ కూడా చల్లని, చీకటి ప్రదేశంలోనే పెట్టాలి. పాడైన పెర్ఫ్యూమ్ లో మన చర్మానికి హాని చేసే కెమికల్స్ ఉంటాయి. అలాగే మీరు కొన్న డేట్ నుంచి మూడేండ్ల లోపే పెర్ఫ్యూమ్ ను వాడేసేయాలి.