మొక్కజొన్నలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది మిమ్మల్ని ఎక్కువసేపు కడుపు నిండి ఉండేలా చేస్తుంది. అలాగే, ఇది నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లను కలిగి ఉండటం వలన, ఇది ఆకస్మిక ఆకలిని నివారించడంలో సహాయపడుతుంది. స్థిరమైన బరువు తగ్గించే ప్రయత్నాలకు సహాయపడుతుంది.
చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
జొన్నలో టానిన్లు, ఫినోలిక్ ఆమ్లాలు , ఆంథోసైనిన్లు వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించడంలో సహాయపడతాయి. ఈ సమ్మేళనాలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి, చర్మ స్థితిస్థాపకతను కాపాడుతాయి. దీని వల్ల చర్మం, యవ్వనంగా ప్రకశవంతంగా కనపడుతుంది.
జుట్టు ఆరోగ్యం:
జొన్నలో ఐరన్, జింక్ ఉంటాయి, ఇది రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు కుదుళ్లను పోషిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. చాలా ప్రయోజనాలను కలిగి ఉన్న జొన్నను మన ఆహారంలో చేర్చుకోవడం ద్వారా, మనం మన ఆరోగ్యాన్ని సరైన మార్గంలో సులభంగా కాపాడుకోవచ్చు.