గుడ్లగూబ...
గరుడ పురాణం ప్రకారం... ఇతరులను మోసం చేయడం మంచి పద్దతి. ఇతరులను మోసం చేయడానికి తన తెలివితేటలను ఉపయోగించే వారు.. వచ్చే జన్మలో గుడ్ల గూబ గా జన్మించే అవకాశం ఉంది. గుబ్ల గూబ జీవితం చీకటి, భ్రమ, అజ్ఞానికి సూచికగా పరిగణిస్తారు. అందుకే, అలా మోసం చేయకూడదని గరుడ పురాణం చెబుతోంది.
కుక్కగా జన్మించడం....
ధర్మాన్ని, వేదాలను, పురాణాలను లేదా దేవుళ్లను అగౌరవపరిచే వారు వారి తదుపరి జన్మలో కుక్కలుగా పునర్జన్మ పొందుతారని గరుడ పురాణం ప్రముఖంగా పేర్కొంది. ధర్మాన్ని , దేవతలను అవమానించే వ్యక్తి ఆత్మ వారి తదుపరి జన్మలో కుక్కగా పునర్జన్మ పొందుతారు. చాలా కష్టాలను ఎదుర్కుంటారు.