నిమ్మకాయ నీళ్లు తాగితే నిజంగా బరువు తగ్గుతారా..?

First Published Jun 23, 2022, 2:16 PM IST

Lemon Water For Weight Loss : నిమ్మకాయ మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ముఖ్యంగా నిమ్మకాయ బరువు తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని కొందరు నమ్ముతుంటారు. ఇంతకీ అది నిజమేనా..? 

నిమ్మకాయలో ఎన్నో ఔషదగుణాలున్నాయి. ముఖ్యంగా నిమ్మకాయ నీళ్లను ఎండాకాలంలో ఎక్కువగా తాగుతుంటారు. లెమన్ వాటర్ బాడీని కూల్ గా ఉంచడంతో పాటుగా.. వేసవి దాహాన్ని కూడా తీరుస్తుంది. ఇలాంటి నిమ్మకాయ నీరు జీవక్రియను పెంచి బరువును తగ్గించగలదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీటిని తాగితే అధిక బరువు (Overweight) తగ్గడమే కాకుండా మీరు రిఫ్రెష్ గా కూడా కనిపిస్తారు.

నిమ్మలో విటమిన్ సి తో పాటు, ఫైబర్స్ (Fibers), పోషకాలు (Nutrients), ఖనిజాలు (Minerals), విటమిన్ బి 6 (Vitamin B6), సిట్రిక్ యాసిడ్ (Citric acid), పొటాషియం (Potassium) వంటివి పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి  సహాయపడే ఔషదగుణాలు నిమ్మకాయలో ఎన్నో ఉంటాయి. 
 

నిమ్మకాయ నీరు (Lemon water) తాగడ వల్ల మన శరీరం నుంచి టాక్సిన్స్ (Toxins)బయటకు పోతాయి. అలాగే కడుపు మంటను కూడా తగ్గిస్తుంది. నిమ్మకాయ నీటిలో కాస్త ఉప్పును జోడించడం వల్ల రుచికరంగానే కాదు జీర్ణ సమస్యలు (Digestive problems), మృదువైన ప్రేగు కదలికల నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.

నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants)చాలా ఉంటాయి. అలాగే తక్కువ కేలరీలు ఉంటాయి. భోజనానికి ముందు నిమ్మకాయ నీరు తాగటం మంచిది.  అల్పాహారం లేదా భోజన చేసే ముందు లెమన్ వాటర్ ను తాగితే.. అది కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉప్పు, నిమ్మకాయ నీటి కలయిక జీర్ణశయాంతర ప్రేగు యొక్క పిహెచ్ స్థాయిని నిర్వహించడానికి ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది వివిధ చర్మ వ్యాధులు (Skin diseases), అసిడిటీ (Acidity), ఆర్థరైటిస్ (Arthritis) నుంచి విముక్తి లభిస్తుంది. నిమ్మకాయ నీటిలో ఉప్పు వాడకం కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది.
 

నిమ్మకాయ నీటిని తీసుకోవడం లేదా.. ఇతర మార్గాల ద్వారా నిమ్మకాయను ఉపయోగించడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తప్పుతుంది. ఇది క్యాన్సర్లను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడానికి, మూత్రపిండాలకు రక్షణ కల్పించడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని శుద్ధి చేయడానికి, ఆరోగ్యకరమైన శరీరాన్ని అందించడానికి కూడా సహాయపడుతుంది. వేడి నీటిలో తేనె, నిమ్మకాయ మిక్స్ చేసి తాగితే శరీరం శుభ్రపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

click me!