Beauty Tips: అద్భుతమైన అందం కోసం.. బ్లాక్ సాల్ట్ మంచి రెమెడీ!

Navya G | Published : Oct 24, 2023 1:15 PM
Google News Follow Us

Beauty Tips: సాధారణంగా బ్లాక్ సాల్ట్ వంటలకి రుచిని ఇవ్వటంతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే అందానికి కూడా ఈ బ్లాక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు అదెలాగో చూద్దాం.
 

15
Beauty Tips: అద్భుతమైన అందం కోసం.. బ్లాక్ సాల్ట్ మంచి రెమెడీ!

 కాలా నమక్ అని పిలవబడే నల్ల ఉప్పులో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి. దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నార్మల్ సాల్ట్ లా ఈ సాల్టు రక్తంలో సోడియం స్థాయిని పెంచదు. అందుకే రక్తపోటు ఉన్నవారికి ఇది సిఫార్సు చేయబడుతుంది.
 

25

 అయితే ఇది కేవలం ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా అందాన్ని కాపాడుకోవడానికి కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. బ్లాక్ సాల్ట్ ని మెరిసే చర్మం కోసం క్లెన్సర్  గా వాడుకోవచ్చు. ఒక గిన్నెలో నల్ల ఉప్పు బేకింగ్ సోడా, ఆలివ్ ఆయిల్ మరియు మీకు ఇష్టమైన నూనె కొన్ని చుక్కలు జోడించండి.

35

 తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మోకాలు మరియు మోచేతులపై ఎక్కువ శ్రద్ధతో మిగిలిన చర్మంపై కాస్త మృదువుగా వృత్తాకార కదలికలతో స్క్రబ్ చేయండి. సున్నితమైన ప్రాంతాలని స్క్రబ్ చేయటం మానేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో  శరీరాన్ని శుభ్రం చేసుకోండి.
 

Related Articles

45

 ఇలా చేస్తే చర్మంపై ఉండే లోతైన మురికి శుభ్రపడుతుంది. ఇది అధిక నూనె ను దూరంగా ఉంచి ఆ ప్రాంతంలో రక్తప్రసరణను ప్రోత్సహిస్తుంది. అలాగే పసుపు రంగు గోళ్ళను నార్మల్గా చేయడంలో కూడా బ్లాక్ సాల్ట్ బాగా ఉపయోగపడుతుంది. నీటిలో కొంత నల్ల ఉప్పుని కరిగించి కాటన్ బాల్స్ ని ఉపయోగించి మీ గోళ్ళ  పై అప్లై చేయండి. 

55

 దీనిని కొద్దిగా మర్దనా చేస్తున్నట్లుగా రాయండి. అరగంట తర్వాత మీ చేతులను కడుక్కోండి. ఇలా చేయటం వలన మీ గోళ్లు మెరుపుని సంతరించుకుంటాయి. ఎందుకంటే బ్లాక్ సాల్ట్ కి అసలు రంగును తిరిగి ఇచ్చే ఉన్నతమైన ఎక్స్ ఫోలియేటింగ్  లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ బ్లాక్ సాల్ట్ ని సలాడ్స్ మీద ఉడికించిన కోడిగుడ్డు మీద జోడించి తినటం వలన ఖనిజాలు అధికంగా లభించే అదనపు బరువుని తగ్గిస్తుంది.

Recommended Photos