ఈ వాటర్ వల్ల కలిగే ప్రయోజనాలు
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ నల్ల ఎండుద్రాక్ష వాటర్ లో రాగి, ఇనుము, ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ వాటర్ మన ఎర్ర రక్త కణాలను పెంచుతుంది. ఇది శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అంతేకాదు ఈ వాటర్ బ్లడ్ ప్యూరిఫైయర్ గా కూడా పని చేస్తుంది. ఇది పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీరియడ్స్ సమయంలో రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది రక్తహీనతను నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఈ వాటర్ ను రెగ్యులర్ గా తాగితే రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.