ఈ వయసులో కూడా బిపాసా బసు అంత ఫిట్ గా ఎలా ఉంటుంది? ఆమె సీక్రేట్స్ ఏంటి?

First Published | Jan 7, 2024, 10:38 AM IST

బిపాసా బసు.. ఒక ఫేమస్ యాక్టర్. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం వంటి భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది ఈ భామ. ఈ రోజు బిపాసా బసు పుట్టిన రోజు. అందుకే ఈ స్పెషల్ డే నాడు ఆమె ఫిట్ నెస్ సీక్రేట్స్ ఏంటో తెలుసుకుందాం..
 

బిపాసా బసు తెలియని వారు చాలా తక్కువే. ఈ సుందరి ఎక్కువగా హిందీ సినిమాల్లో కనిపిస్తుంది. తెలుగు, తమిళం, బెంగాళీ, ఇంగ్లీష్ సినిమాల్లో కూడా ఈమె నటించి ప్రేక్షకులను మెప్పించింది. మీకు తెలుసా? ఈ రోజు బిపాసా బసు పుట్టిన రోజు. ఇప్పుడు ఆమె వయసు 45 ఏండ్లు. ఈ వయసులో ఈమె అందం ఇంత కూడా తగ్గలేదు. అలాగే ఆమె ఫిట్ నెస్ ను చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. అసలు ఆమె ఇంత ఫిట్ గా ఉండేందుకు ఏం చేస్తుంది? ఆ సీక్రేట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

విభిన్న వ్యాయామాలు

బిపాసా బసు వారానికి ఆరు రోజులు జిమ్‌ కు ఖచ్చితంగా వెళ్తుంది. దీంట్లో ఏ మార్పులు ఉండవు. ఆమె వ్యాయామ దినచర్యలో స్క్వాట్స్, లంగ్స్, కిక్‌బాక్సింగ్, పైలేట్స్, యోగా, వెయిట్ ట్రైనింగ్, కార్డియోలు ఉంటాయి. దీనివల్ల ఆమె బలంగా ఉంటుంది. 
 

Latest Videos


సమతుల్య ఆహారం

బిపాసా బసు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లతో కూడిన ఎక్కు ప్రోటీన్ ఉన్న ఆహారాలను తీసుకుంటుంది. మీకు తెలుసా? ఆమె టీ, కాఫీ, డైరీ లాంటివి అసలే తీసుకోదు. ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్ కు ఈమె దూరం. ఈమె రోజూ తాజా కూరగాయలు, చపాతీలను తింటుంది. ప్రతి రోజూ ఇంట్లో వండిన బెంగాలీ వంటకాలనే తింటుంది. నీటిని పుష్కలంగా తాగుతుంది. అలాగే తాజా పండ్లు, కొబ్బరి నీళ్లను కూడా తీసుకుంటుంది. 
 

క్రమశిక్షణ

బిపాసా బసు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరిస్తుంది. ఇదే ఆమె ఫిట్ నెస్ జర్నీకి మూలస్తంభం. హెల్తీ లైఫ్ ను గడపడానికి దృఢ సంకల్పం, క్రమశిక్షణ అవసరమని ఆమె నొక్కి చెప్తారు. మీ ఫిట్‌నెస్ లక్ష్యాలకు కట్టుబడి ఉండటానికి మీ నిజమైన స్వభావాన్ని అర్థం చేసుకోవడం, స్వీకరించడం ప్రాథమికమైందని ఆమె అంటారు.
 

స్వీయ ప్రేమ

వ్యాయామం, క్రమశిక్షణతో పాటుగా స్వీయ-ప్రేమ కూడా ముఖ్యమేనంటుంది బిపాసా. మిమ్మల్ని మీరు ప్రేమించడం, దాని గురించి గర్వపడటం చాలా అవసరమని ఆమె నమ్ముతుంది. ఇది శారీరక మార్పుల గురించి మాత్రమే కాదు, మానసిక శ్రేయస్సు గురించి కూడా.
 

Bipasha Basu

ప్రసవానంతర అంకితభావం

బిపాసా బసు నవంబర్ 2022లో కూతురు దేవికి జన్మనిచ్చింది. అయినా ఆమె ఏమాత్రం తగ్గలేదు. ఆమె ప్రసవానంతర ప్రయాణంలో పైలేట్స్, యోగా, వెయిట్ ట్రైనింగ్, కార్డియోలు చేసేది. 
 

గర్భధారణ తర్వాత ఆరోగ్యకరమైన ఆహారం

ఈ స్టార్ పోస్ట్ ప్రెగ్నెన్సీ డైట్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె బ్యాలెన్స్‌డ్ డైట్‌ని ఫాలో అవుతూనే ఉంది. ఇది శారీరక, మానసిక శ్రేయస్సు రెండింటికీ మేలు చేస్తుందని ఆమె నమ్ముతుంది. 
 

Image: Bipasha BasuInstagram

శరీర సానుకూలతను ప్రోత్సహించడం

బిపాసా బాడీ పాజిటివిటీకి ప్రమోటర్‌గా నిలుస్తుంది. గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. బిడ్డ పుట్టిన తర్వాత కూడా శారీరకంగా మార్పులు రావడం సహజం. దీంతో ఆమె కాస్త బొద్దుగా మారింది. కానీ దీనిపై ఎంతో మంది ట్రోల్ చేసినా.. ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. ముఖ్యంగా ఆమె తన ఫిట్ నెస్ తో ట్రోలర్స్ ను నోరు మూయించింది. గర్వంగా తనను తాను ఆరోగ్యకరమైన, సంతోషంగా ఉన్న తల్లిగా ప్రకటించుకుంది.

Bipasha Basu

ఫిట్ కమ్యూనిటీని ప్రేరేపించడం

తన ప్రయాణం ద్వారా.. బిపాసా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి స్ఫూర్తినిస్తూనే ఉంది. ఆమె సోషల్ మీడియా ద్వారా జనాలకు వర్కవుట్ రొటీన్‌లు, హెల్తీ రెసిపీలు, నిష్కపటమైన క్షణాలతో నిండిన ప్రేరణకు కేంద్రంగా మారింది. ఆమె ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి ప్రోత్సాహానికి ఇది  దారితీసింది.

click me!