నోటికి నచ్చింది కాదు, మీ శరీరానికి నచ్చిన ఆహారం తినండి.. అవేంటంటే..

First Published | Dec 22, 2024, 3:01 PM IST

మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. శరీరంలో ఒక్కో భాగానికి ఒక్కో రకమైన ఆహారం మేలు చేస్తుందని అంటున్నారు. ఇంతకీ శరీరంలో ఏ భాగానికి ఎలాంటి ఆహారం మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సైతం సూచిస్తుంటారు. శరీరంలో ఒక్కో భాగానికి ఒక్కో రకమైన ఆహారం మేలు చేస్తుందని అంటున్నారు. ఇంతకీ శరీరంలో ఏ భాగానికి ఎలాంటి ఆహారం మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

కాలేయం ఆరోగ్యం..

శరీరం ఆరోగ్యంగా ఉండడంలో కాలేయం కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాలేయ పనితీరులో ఏమాత్రం తేడా వచ్చినా శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాంటి కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో పసుపు ఎక్కువగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌ ఎలిమెంట్స్‌ లివర్‌ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అలాగే బీట్‌రూట్‌, క్యారెట్‌ వంటివి కూడా కాలేయం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 
 


చర్మ ఆరోగ్యానికి..

చర్మం ఆరోగ్యంగా ఉంటూ కాంతివంతంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో యాపిల్స్‌ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే బీట్‌రూట్, క్యారెట్‌ వంటి వాటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి. వీటిలోని యాంటీ యాక్సిడెంట్స్‌ శరీరాన్ని మెరిసేలా చేస్తాయి. 
 

కిడ్నీల ఆరోగ్యానికి..

శరీరంలో కీలక పాత్ర పోషించే మరో అవయవం కిడ్నీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కీరదోసను రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఇందులోని వాటర్‌ కంటెంట్‌ కిడ్నీలకు మేలు చేస్తుంది. అలాగే రోజూ ఉదయం నిమ్మరసం తాగాలి. ఇది కిడ్నీలను శుభ్రం చేయడంలో ఉపయోగపడుతుంది. 

జీర్ణ వ్యవస్థ కోసం..

తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే శరీరంలో అన్ని క్రియలు సజావుగా సాగుతాయి. అలాంటి జీర్ణ వ్యవస్థ మెరుగ్గా ఉండాలంటే తీసుకునే ఆహారంలో కీరదోస, గ్రీన్‌యాపిల్‌, అలోవెరాను భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 

ఊపిరితిత్తుల కోసం..

ఊపిరితిత్తుల శుభ్రంగా మారి ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో అల్లం ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అల్లంలోని మంచి గుణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అలాగే వెల్లుల్లి కూడా లంగ్స్‌ను క్లీన్‌ చేయడంలో సహాయపడతాయి. ఇక పైనాపిల్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. 

రక్తానికి..

శరీరంలో రక్తం శుద్ధిగా ఉంటేనే జీవ క్రియలన్నీ సాఫీగా సాగుతాయి. అలాంటి రక్తం శుభ్రంగా మారాలంటే తీసుకునే ఆహారంలో దానిమ్మకు కచ్చితంగా భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నారింజ, అల్లం కూడా రక్తాన్ని శుద్ధి చేయడంలో తోడ్పడుతుంది. 

గమనిక: పైన తెలిపిన వివరాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 
 

Latest Videos

click me!