యువతలో పెరుగుతోన్న ఫ్యాటీ లివర్‌ సమస్య.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు

First Published | Dec 21, 2024, 6:07 PM IST

ఇటీవల చాలా మందిలో ఫ్యాటీ లివర్‌ సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా యువతను ఈ సమస్య కలవరపడుతోంది. ఫ్యాటీ లివర్‌ సమస్యను లైట్ తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా ఫ్యాటీ లివర్‌ను ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

మారుతోన్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల ఫ్యాటీ లివర్‌ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో ఇటీవల ఈ తీరు ఎక్కువుతోంది. ఎక్కువగా జంక్‌ ఫుడ్‌ తినడం, ఆల్కహాల్‌ సేవించడంతో పాటు నిద్రలేమి, ఒత్తిడి ఇలా రకరకాల కారణాలు ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ సమస్యను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

ఫ్యాటీ లివర్‌ సమస్య ఉన్న వారిలో కనిపించే ప్రధాన లక్షణం కాలేయం పరిమాణం పెరగడం. కడుపులో లివర్‌ ఉన్న చోట చర్మం ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. దానిని నొక్కినప్పుడు కాస్త నొప్పిగా ఉంటుంది. లివర్‌ పెరగడాన్ని హెపాటోమెగాలిగా పిలుస్తుంటారు. ఫ్యాటీ లివర్‌ వచ్చిన వారిలో కనిపించే ప్రధాన లక్షణం ఇదే. కడుపులో ఒక భాగంలో ఉబ్బినట్లు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అయ్యి వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. 
 


Chill Legs

ఇక ఫ్యాటీ లివర్‌ ఉన్న వారిలో కనిపించే మరో ప్రధాన లక్షణం పాదాలు వాపునకు గురి కావడం. కాళ్లతో పాటు చేతులు ఉబ్బినట్లు కనిపిస్తే అది ఫ్యాటీ లివర్‌కు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. లివర్‌ పనితీరు దెబ్బతింటేనే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇక జీర్ణ సంబంధిత సమస్యలు సైతం ఫ్యాటీ లివర్‌ ప్రాథమిక లక్షణంగా చెప్పొచ్చు. 

ఈ సమస్య ఉన్న వారిలో జీర్ణ వ్యవస్థ పనితీరుపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణంకాకపోయినా, ఆకలి తగ్గినా ఫ్యాటీ లివర్‌ లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇక నిత్యం వికారంగా ఉన్నా, ఆహారం తిన్న వెంటనే వాంతికి వచ్చిన భావన కలిగినా లివర్‌ సమస్య ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. అలాగే ఎలాంటి పనిచేయకపోయినా ఊరికే అలసిపోతున్నా ఫ్యాటీ లివర్‌కు సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్‌ సమస్య కారణంగా శరీరంలో నిస్సత్తువుగా మారుతుంది. రాత్రంతా బాగా నిద్ర ఉన్నా ఉదయాన్నే అలసిపోయిన భావన కలుగుతుంది. 
 

ఫ్యాటీ లివర్‌ సమస్యతో బాధపడేవారిలో పొట్ట ఉబ్బిపోయినట్లు కనిపిస్తుంది. కొంచం తినగానే పొట్ట ఉబ్బుతంది. లివ‌ర్ పనితీరు దెబ్బతింటే శరీరంలోని వ్యర్థాలు సరిగ్గా బయటకుపోవు. ఈ కారణంగా చర్మంపై దురద వస్తుంది. కొందరిలో చర్మంపై దద్దుర్లు కూడా కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్‌ సమస్యను ముందుగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయకపోతే అది సిర్రోసిస్‌గా మారే ప్ర‌మాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంలో ఇది క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఏమాత్రం కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు. 
 

Latest Videos

click me!