పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం. మూడు ముళ్లతో ఈ బంధం ఏర్పడి.. జీవితాంతం కలిసి నడుస్తామని ఒకరికొకరు వాగ్దానం చేసుకుంటారు. పెళ్లి తర్వాత జీవితాంతం సంతోషంగా ఉండాలని అమ్మాయిలే కాదు.. అబ్బాయిలు కూడా కలలు కంటారు. అయితే... వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే తమ జీవితంలోకి ఆహ్వానించే అమ్మాయిని సరిగా ఎంచుకోవాలని, కొన్ని లక్షణాలు ఉన్న అమ్మాయిలను మాత్రం పొరపాటున కూడా పెళ్లి చేసుకోకూడదట. వాళ్లతో జీవితం నరకం లా ఉంటుందట.