ఫ్యాట్ పెరుగుతదని చీజ్ ను తినడం మానేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే దీన్ని తినకుండా అస్సలు ఉండలేరు

First Published Jan 16, 2023, 10:55 AM IST

చీజ్ ను తింటే బరువు పెరగడంతో పాటుగా కడుపు ఉబ్బరం సమస్యలు కూడా వస్తాయని చాలా మంది అనుకుంటుంటారు. కానీ వీటిలో కొంచెం కూడా నిజం లేదంటున్నారు నిపుణులు. 
 

చీజ్ ను ఇష్టపడనివారు ఎవరూ ఉండరేమో. వారానికి ఒకసారైన చీజ్ ను పక్కాగా తింటుంటారు. అయితే కొంతమందికి చీజ్ అంటే ఇష్టమున్నా.. అస్సలు తినరు. ఎందుకంటే ఇది శరీర బరువును పెంచడంతో పాటుగా గుండెపోటుకు కూడా కారణమవుతుందని. కానీ దీనిలో నిజం లేదని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. జున్ను గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని ఏ మాత్రం పెంచదని పలు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. చీజ్ లో మంచి బ్యాక్టీరియా, తక్కువ సంతృప్త కొవ్వు లు ఉంటాయి. 
 

cheese

తక్కువ కొవ్వున్న పాల ఉత్పత్తులను తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తారు. ఎందుకంటే ఎక్కువ కొవ్వు చీజ్ వంటి మొత్తం పాల ఉత్పత్తులు సంతృప్త కొవ్వును కలిగి ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. జున్ను బరువు పెరగడానికి, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుందని కొంతమంది అనుకుంటారు. కానీ దీనిలో నిజం లేదంటున్నారు నిపుణులు.  చీజ్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. 

cheese

ముడి, పాశ్చరైజ్డ్ జున్ను ముక్కలు మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి. ఇవి మన గట్ మైక్రోబయోటాకు ప్రయోజనకరంగా ఉంటాయని పరిశోధకులు తెలిపారు. చెడ్డార్, గౌడా వంటి పాత జున్నులలో ఎక్కువగా కనిపించే ఈ మంచి బ్యాక్టీరియా ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి, విటమిన్లను సంశ్లేషణ చేయడానికి, అనారోగ్యానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నిరోధించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జున్నును తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు పెరగరు

జున్నును తింటే బరువు తగ్గడంతో పాటుగా అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జున్ను బరువును నియంత్రించడంలో సహాయపడటానికి కారణం ఏంటంటే.. ఇది ఇతర పాల ఉత్పత్తుల కంటే ఆకలిని బాగా తగ్గిస్తుంది.

హృదయ సంబంధ వ్యాధులు

హృదయ సంబంధ వ్యాధులపై జున్ను ప్రభావాన్ని పరిశీలించిన.. యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ తో ప్రచురించబడిన 15 అధ్యయనాల  మెటా-విశ్లేషణలో.. జున్నును ఎక్కువ తినే వ్యక్తులు (రోజుకు 1.5 ఔన్సులు) ఏమీ తినని వారి కంటే 10 శాతం తక్కువ ప్రమాదాన్ని కలిగి ఉన్నారని కనుగొన్నారు. జున్ను గుండె జబ్బుల ప్రమాదాన్ని ఏ విధంగానూ ప్రభావితం చేయదని ఇతర పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.  
 

డయాబెటిస్, రక్తపోటు

తక్కువ కొవ్వు ఉన్న జున్ను, ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల డయాబెటీస్, రక్తపోటు ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 21 దేశాలలో 145,000 మందికి పైగా జరిపిన ఒక అధ్యయనంలో..   రోజుకు రెండుసార్లు పూర్తి కొవ్వు డైరీని తీసుకోవడం వల్ల  వల్ల డయాబెటీస్, రక్తపోటు ప్రమాదం 24, 11 శాతం తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. 
 

లాక్టోస్ అసహనం

పాలలోని చక్కెర అయిన లాక్టోస్ ను కొంతమందికి అస్సలు జీర్ణం కాదు. ఇది విరేచనాలు, కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణశయాంతర సమస్యలకు దారితీస్తుంది. కానీ జున్ను తయారు చేయడానికి ఉపయోగించే బ్యాక్టీరియా పాలలోని లాక్టోస్ లో ఎక్కువ భాగాన్ని జీర్ణం చేస్తుందని అమెరికన్ చీజ్ సొసైటీకి చెందిన జామీ పింగ్ చెప్పారు.

cheese

దీన్ని ఎంత తినాలి? 

జున్ను ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపనప్పటికీ.. దీనిని మీ మొత్తం ఆహారంలో ఎలా చేర్చుకుంటారు అనేది ముఖ్యమంటున్నారు నిపుణులు. చాలా మంది రోజుకు మొత్తంలో జున్నును సగటున 1.5 ఔన్సులు తింటారు. కొన్ని సందర్భాల్లో 3 ఔన్సుల వరకు కూడా తింటారు. ఒక ఔన్సు జున్ను మీ బొటనవేలు పరిమాణంలో ఉంటుంది.

click me!