ఇలాంటి వాళ్లకు ఎవరూ మర్యాద ఇవ్వరు తెలుసా?

Published : Mar 25, 2024, 12:00 PM IST

కొన్నిసార్లు మనం ఆశించిన గౌరవం, మర్యాద మనకు దక్కవు. అందుకు... మన ప్రవర్తనే కారణం అవుతుంది. ఈ కింది బిహేవియర్ తో ఉండే వారిని ఎవరూ ఎప్పటికీ గౌరవించరు. ఎలాంటి ప్రవర్తనను దూరంగా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..  

PREV
17
ఇలాంటి వాళ్లకు ఎవరూ మర్యాద ఇవ్వరు తెలుసా?

సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదుటి వ్యక్తి నుంచి గౌరవం, మర్యాద పొందాలనే అనుకుంటారు. తాము చేసే పనిని బట్టి.. మన ప్రవర్తనను మనకు గౌరవం లభిస్తే చాలు అనుకునేవారు చాలా మంది ఉంటారు. కానీ.. కొన్నిసార్లు మనం ఆశించిన గౌరవం, మర్యాద మనకు దక్కవు. అందుకు... మన ప్రవర్తనే కారణం అవుతుంది. ఈ కింది బిహేవియర్ తో ఉండే వారిని ఎవరూ ఎప్పటికీ గౌరవించరు. ఎలాంటి ప్రవర్తనను దూరంగా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

27
couple fight

1.నిజాయితీగా లేకపోవడం..
నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. కానీ.. కొందరికి అందరితో నిజాయితీగా ఉండటం రాదు. తమను నమ్మిన వాళ్లతో కూడా నిజాయితీగా ఉండరు. మొదట్లో వారిని  గుర్తించకపోవచ్చు. కానీ...  ఒక్కసారి ఆ విషయం తెలిసిన తర్వాత.. మిమ్మల్ని జీవితంలో ఎవరూ నమ్మరు. ఒక్కసారి నమ్మకం కోల్పోయిన తర్వాత... మిమ్మల్ని నమ్మకపోగా... మీకు కనీసం మర్యాద కూడా ఇవ్వరు.

37

2.మర్యాద ఇవ్వకపోవడం..
ఇతరుల నుంచి మనం మర్యాద ఆశించడం  చాలా కాజ్యువల్. అయితే... మనం ఇతరులకు మర్యాద ఇచ్చినప్పుడే.. మనకు కూడా ఇతరులు మర్యాద ఇస్తారు.  మనం వాళ్లను ప్రతిసారీ అగౌరపరుస్తూ ఉంటే.. వాళ్లు తిరిగి మనకు మర్యాద ఎలా ఇస్తారు..? ఏదైనా ఇరువైపులా ఉండాలి. ముందుగా..మనం ఇతరులతో మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి.

47

3.నిలకడగా ఏకపోవడం..
మాట నిలకడగా ఉండటం చాలా అవసరం. కానీ.. ఒక్కోసారి కొందరు ప్రతి సారీ మాట మారుస్తూ ఉంటారు. ఒక్కోసారి ఒక్కోమాట చెబుతూ ఉంటారు. మాట మీద నిలకడగా ఉండరు. అలాంటివారిని కూడా ఎవరూ నమ్మరు. వారికి గౌరవ, మర్యాదలు కూడా ఇవ్వడానికి ప్రజలు ఇష్టపడరు.

57

4.అహంకారం..
చాలా మందిలో అహంకారం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేనా.. తమపై తమకు ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.  అన్నీ తమకు మాత్రమే తెలుసు అనే అహంకారంతో ఉంటారు. అలాంటివారిని కూడా ఎవరూ గౌరవ మర్యాదలు ఇవ్వడానికి ఇష్టపడరు.

67

5.సెల్ఫిష్..
చాలా మంది ప్రతి విషయంలో చాలా సెల్ఫిష్ గా ఉంటారు. ప్రతిదీ తమకే కావాలని, తమకే దక్కాలని అనుకుంటూ ఉంటారు. ప్రతి విషయంలోనూ సెల్ఫిష్ గా ఆలోచిస్తూ ఉంటారు. అలా సెల్ఫిష్ గా ఆలోచించే వారిపట్ల కూడా.. ఎవరూ ఎక్కువగా గౌరవ మర్యాదలు చూపించరు.

77

6.బాధ్యతగా లేకపోవడం..
తమ ఇంటి,పని విషయంలో బాధ్యతగా ఉండటం చాలా అవసరం. కానీ, చాలా మంది ఏ విషయంలోనూ బాధ్యతగా వ్యవహరించరు. బాధ్యతగా లేకుండా.. చిల్లరగా తిరుగుతూ ఉంటారు. అలాంటివారికి కూడా ఎవరూ గౌరవ, మర్యాదలు ఇవ్వాలి అనుకోరు.

click me!

Recommended Stories