బాత్రూమ్ క్లీన్ గా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు. కానీ బాత్రూమ్ శుభ్రం చేసేటప్పుడు మనం చేసే కొన్ని తప్పుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా బాత్రూమ్ డోర్లు, కిటికీలు మూసి క్లీన్ చేయడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.
ఇంటి శుభ్రతలో బాత్రూమ్ క్లీనింగ్ కూడా ముఖ్యమైన పని. కానీ చాలా మంది తెలియక చేస్తున్న చిన్న తప్పు ఆరోగ్యానికి పెద్ద ప్రమాదంగా మారుతోంది. బాత్రూమ్ డోర్లు, కిటికీలు పూర్తిగా మూసి శుభ్రం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కెమికల్ ఆధారిత క్లీనర్లు వాడే సమయంలో ఇది మరింత ప్రమాదకరంగా మారుతుంది. క్లోస్డ్ బాత్రూమ్‌లో విష వాయువులు వేగంగా పేరుకుపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.
27
ఊపిరితిత్తులపై చెడు ప్రభావం
నిపుణుల ప్రకారం.. బాత్రూమ్ క్లీనింగ్‌కు ఉపయోగించే ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్, యాసిడ్ క్లీనర్ల వంటి వాటిలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి వాడినప్పుడు గాలిలోకి విష వాయువులు విడుదలవుతాయి. బాత్రూమ్ డోర్లు మూసి ఉండటం వల్ల అవి లోపలే పేరుకుపోతాయి. శుభ్రం చేస్తున్న వ్యక్తి వాటిని పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
37
ఈ సమస్యలు తప్పవు
ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ఆస్తమా లేదా అలెర్జీ సమస్యలు ఉన్నవారికి ఇది అత్యంత ప్రమాదకరం. మూసివేసిన బాత్రూమ్‌లో ఎక్కువసేపు క్లీనింగ్ చేస్తే తలనొప్పి, కళ్లు మంటలు, గొంతులో మంట, వాంతులు, మత్తుగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఆక్సిజన్ లోపం వల్ల స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొంతమంది క్లీనింగ్ త్వరగా పూర్తికావాలని ఒకటి కంటే ఎక్కువ కెమికల్స్ కలిపి వాడుతుంటారు. అది చాలా ప్రమాదకరం. యాసిడ్ క్లీనర్‌తో బ్లీచింగ్ పౌడర్ కలపడం వల్ల క్లోరిన్ గ్యాస్ విడుదలవుతుంది. ఇది అత్యంత విషపూరితమైన వాయువు. మూసి ఉన్న బాత్రూమ్‌లో ఇది క్షణాల్లోనే ప్రాణాంతకంగా మారుతుంది.
57
ప్రమాదకరమైన వ్యాధులు
క్లీనింగ్ సమయంలో మన శరీరం ఎక్కువగా శ్రమిస్తుంది. కాబట్టి శ్వాస వేగం పెరుగుతుంది. అదే సమయంలో విష వాయువులు ఎక్కువగా పీల్చుకుంటే అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్లి నష్టం కలిగిస్తాయి. దీర్ఘకాలంలో ఇది లంగ్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు, ఆస్తమా తీవ్రత పెరగడానికి కారణం కావచ్చు. కాబట్టి క్లీనింగ్‌ను చాలా తేలికగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
67
బాత్రూమ్‌ను సురక్షితంగా ఎలా శుభ్రం చేయాలి?
నిపుణుల సలహా ప్రకారం బాత్రూమ్ క్లీన్ చేసే ముందు తప్పనిసరిగా డోర్లు, కిటికీలు పూర్తిగా తెరిచి ఉంచాలి. బాత్రూమ్‌లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటే అది ఆన్ చేయాలి. ఇలా చేస్తే విష వాయువులు బయటకు వెళ్లి గాలి ప్రసరణ సరిగ్గా ఉంటుంది. అలాగే మాస్క్, గ్లోవ్స్ ధరించడం వల్ల కెమికల్స్ నేరుగా శరీరాన్ని తాకకుండా ఉంటాయి.
77
సహజ క్లీనర్ల వాడకం
క్లీనింగ్ కెమికల్స్‌ను ఎప్పుడూ కలిపి వాడకూడదు. ఒకసారి ఒక క్లీనర్ వాడిన తర్వాత బాగా నీటితో కడిగి.. ఆ తర్వాత మరొకటి వాడాలి. వీలైతే కెమికల్ క్లీనర్లకు బదులు వెనిగర్, బేకింగ్ సోడా వంటి సహజ ప్రత్యామ్నాయాలను వాడటం మంచిది.