ఖరీదైన ఉత్పత్తులు కాదు... ఆహారం ముఖ్యం...
ఖరీదైన షాంపూలు వాడుతున్నా సరే, ఆహారం సరిగా తీసుకోకపోతే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. కాబట్టి, పోషకాలు ఉన్న ఆహారం కచ్చితంగా తీసుకోవాలి. పప్పులు, గుడ్లు, పెరుగు, పన్నీర్, గింజలు వంటి ఆహారాలను మానేయకూడదు. ఐరన్, విటమిన్ డి లోపాలు జుట్టు రాలడానికి ప్రధాన కారణాలు. సీజనల్ గా లభించే పండ్లు, ఆకుకూరలు, సరిపడా నీరు తీసుకుంటే.. జుట్టు రాలదు.
మీ జుట్టు ఆకృతిని అంగీకరించాలి
చాలామంది తమ జుట్టు సహజ ఆకృతిని అంగీకరించరు. ఉంగరాల జుట్టును స్మూత్ గా చేయడం, నార్మల్ హెయిర్ ని కర్లీ హెయిర్ గా మార్చడం లాంటివి చేస్తూ ఉంటారు. ప్రతిరోజూ హీట్ స్టైలిగ్ చేయడం స్టైలింగ్ కాదు. జుట్టును మరింత ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి, ఇలాంటి పొరపాట్లు చేయకూడదు.
ఓపికగా ఉండాలి...
అందమైన, ఆరోగ్యకరమైన, ఒత్తైన జుట్టు రాత్రికి రాత్రే వచ్చేయదు. మనం రెగ్యులర్ గా కొన్ని పనులు చేయడం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. రెగ్యులర్ గా హెయిర్ వాష్ చేయడం, అవసరం అయినప్పుడు హెయిర్ కట్ చేయడం, కెమికల్స్ ఉన్న ఉత్పత్తులు వాడటం మానేయడం లాంటివి చేయాలి. అంతేకాదు... మంచి నాణ్యత ఉన్న నీరు వాడటం, ఒత్తిడి తగ్గించుకోవాలి. కనీసం మూడు నెలల పాటు ఒకే రోటీన్ ఫాలో అవ్వడం వల్ల జుట్టు అందంగా మారుతుంది.