Joint Pain: మీ ఇంట్లో ఉప్పు ఉందా.? అయితే మీకు జ‌న్మ‌లో కీళ్ల నొప్పులు రావు, ఎలాగంటే..

Published : May 12, 2025, 08:12 AM IST

జాయింట్ పెయిన్ నుంచి ఉపశమనం పొందడానికి ఒక సులభమైన ఆయుర్వేద పద్ధతి ఉంది ఉప్పు ప్యాకెట్ తో నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇంతకీ సాల్ట్ ప్యాకెట్ ఎలా తయారు చేసుకోవాలి.? ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
15
Joint Pain: మీ ఇంట్లో ఉప్పు ఉందా.? అయితే మీకు జ‌న్మ‌లో కీళ్ల నొప్పులు రావు, ఎలాగంటే..

మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు, గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం వల్ల కీళ్ల నొప్పులు సర్వసాధారణం అయిపోయాయి. గతంలో పెద్దవారిలో ఈ సమస్య కనిపించేది, ఇప్పుడు యువత కూడా మోకాలు, నడుము, భుజాల నొప్పులతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలకు ఆయుర్వేదంలో మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి వాటి ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

25

సాల్ట్ ప్యాకెట్

ఆయుర్వేదంలో కీళ్ల నొప్పులు, నడుము నొప్పి, భుజాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి శతాబ్దాలుగా సాల్ట్ ప్యాకెట్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని సాల్ట్ హీట్ ప్యాడ్ అని కూడా అంటారు. శరీరంలో ఎక్కడైనా నొప్పి, కండరాల నొప్పి లేదా కీళ్ల నొప్పులు ఉంటే, మందులు వేసుకునే ముందు ఈ సులభమైన ఆయుర్వేదిక్ చిట్కాను ప్రయత్నించండి. 

35

ఎలా పనిచేస్తుంది?

శరీరంపై సాల్ట్ హీట్ ప్యాడ్ వేయడం వల్ల ఆ భాగంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల కండరాలు సడలి, నొప్పి, పట్టేసినట్లు లేదా నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నడుము నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పులు, గాయం తర్వాత వాపు, ఋతుక్రమ నొప్పులకు కూడా ఈ టెక్నిక్ ఉపయోగపడుతుంది. 

45

ఉప్పు హీట్ ప్యాడ్‌ని ఎలా తయారు చేయాలి?

ఇందుకోసం ఒక క్లాత్ ముక్కను తీసుకోవాలి అనంతరం అందులో ఉప్పు నింపాలి. ఇప్పుడు దాన్ని ప్యాన్ మీద 2-3 నిమిషాలు వేడి చేయండి. సమయం తర్వాత, పొట్లంను అరచేతిలో ఉంచి వేడిని చెక్ చేయాలి. మరీ ఎక్కువ వేడీ కూడా ఉండకుండా చూసుకోవాలి. అనంతరం శరీరంలో నొప్పి ఉన్న ప్రదేశంలో మర్దన చేసుకోవాలి. 

55

ఈ విషయాలను గుర్తుంచుకోండి

  • ఉప్పును ఎక్కువగా వేడి చేయవద్దు, లేకుంటే అది చర్మాన్ని కాల్చేస్తుంది.
  • క్లాత్ పాతది అయితే దాన్ని మార్చండి. మీరు ఉప్పును చాలాసార్లు వేడి చేసి ఉపయోగించవచ్చు.
  • ఈ సులభమైన, చవకైన, సమర్థవంతమైన చిట్కాతో కీళ్ల నొప్పలకు ఇట్టే చెక్ పెట్టొచ్చు. 
Read more Photos on
click me!

Recommended Stories