జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు దాదాపు 6000 మంది రన్నర్స్ డేటాపై పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనంలో రన్నర్స్ గాయాలు, వారు తినే ఆహారాలపై రీసెర్చ్ జరిగింది. ఈ అధ్యయనం ప్రకారం క్రమం తప్పకుండా పరిగెత్తే దాదాపు 80% కంటే ఎక్కువ మందికి కనీసం ఒక్కసారైనా గాయం అవుతుంది. అలాంటి వారు ఆహారంపై దృష్టి పెట్టడం ద్వారా కాలు గాయాన్ని త్వరగా తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రన్నింగ్ చేసే వారికి నరాలు, కండరాలు లాగడం, బెణకడం లాంటివి జరిగినప్పుడు ఫైబర్, ఫ్యాట్ ఉన్న ఆహారం తింటే గాయాలు త్వరగా మానుతున్నాయని కనుగొన్నారు. అంటే మనం తినేది కాలు గాయాన్ని చాలా వరకు తగ్గించగలదన్న మాట. ఆహారానికి, కాలు గాయానికి మధ్య సంబంధం మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.
గాయానికి, ఆహారానికి మధ్య సంబంధం
డాక్టర్ కోలెబాచ్ ప్రకారం రన్నర్స్ కి అసలు గాయం కాకుండా ఉండటానికి సరైన పౌష్టికాహారం తీసుకోవడం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇదే కాకుండా ఫైబర్, ఫ్యాట్ గాయాలు త్వరగా తగ్గడానికి సహకరిస్తాయి.
అధ్యయనంలోని ఉదాహరణల ప్రకారం రన్నింగ్ చేస్తూ గాయపడిన మహిళ రెగ్యులర్ గా 450 కేలరీల కంటే తక్కువ, 20 గ్రాముల కంటే తక్కువ కొవ్వు తీసుకున్నారు. గాయపడని మహిళలతో పోలిస్తే గాయపడిన మహిళల ఆహారంలో రోజుకు 3 గ్రాముల ఫైబర్ తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ప్రోటీన్, ఆల్కహాల్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం తీసుకోవడం వల్ల గాయానికి సంబంధించిన ఎటువంటి మార్పులు కనిపించలేదు.
అందుకే రన్నర్స్ కు ఫైబర్, ఫ్యాట్ అవసరం
మీరు రన్నర్ అయితే గాయాల నుండి తప్పించుకోవాలనుకుంటే మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ఫైబర్‌ను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. ఇవి 50-65 శాతం కేలరీలు 20-35 శాతం కొవ్వు 10-20 ప్రోటీన్ నుండి వస్తాయి.
పోషకాహార నిపుణుడిని సంప్రదించండి
రన్నర్స్ లేదా అథ్లెట్లు తమ ఆహారాన్ని పోషకాహార నిపుణుడి సహాయంతో మార్చుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తింటే పేషెన్సీ పెరుగుతుంది. అంతేకాకుండా గాయపడే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. పరిగెత్తేటప్పుడు గాయాలు కాకుండా ఉండేందుకు ట్రైనర్ సలహాలు కూడా తీసుకోండి. హైడ్రేటెడ్ గా ఉండటం ద్వారా గాయాల నుంచి రక్షణ పొందవచ్చు.