అపోహ : కోపాన్ని వెళ్లగక్కడం వల్ల తగ్గించుకోవచ్చు.
వాస్తవం: ఇది కూడా సరికాదు. అంతేకాదు వ్యక్తికి, వ్యక్తికి ఇది మారిపోతుంది. కానీ, అలాగని కోపం రాగానే అరుపులు, కేకలు వేస్తూ గందరగోళం చేయద్దు. హింసించొద్దు. దీనివల్ల మీ భావోద్వేగాల తీవ్రత మరింత పెరుగుతుంది. దాంతో మీరు ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల, మీరు కోపంగా ఉన్నప్పుడు కూర్చోని.. విశ్రాంతి తీసుకోవడం.. విశ్లేషించడం ఉత్తమం. హింసాత్మకంగా ఎప్పుడూ ప్రవర్తించొద్దు. అది ఎప్పటికీ సహాయపడదు. విషయాలను మరింత దిగజార్చుతుంది.