అనంత్- రాధికల పెళ్లి చాలా సింపుల్ గా చేశారా..? సర్వేలో తేలింది ఇదే..!

First Published | Jul 16, 2024, 9:58 AM IST

పెళ్లిలో అంబానీ ఫ్యామిలీ ధరించిన దుస్తులు, నగలు, అతిథుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రిపరేషన్స్.. అన్నీ చూసి అందరూ నివ్వెరపోయారు.


మన దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ తన ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిపించిన విషయం తెలిసిందే. చాలా సంవత్సరాలుగా అనంత్ - రాధికలు ప్రేమించుకుంటున్నారు. దీంతో.. ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి అంగీకరించి.. వివాహం జరిపించారు. ఈ నెల అంటే జులై 12వ తేదీన.. వివాహ బంధంతో.. ఈ జంట ఒక్కటయ్యారు.
 

వీరి పెళ్లి ఎంత అట్టహాసంగా చేశారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది లో పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టి.. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్.. తర్వాత.. చివరగా పెళ్లి చేశారు. మన దేశంలోని దాదాపు అందరు సెలబ్రెటీలు ఈ పెళ్లికి వెళ్లి.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లిలో అంబానీ ఫ్యామిలీ ధరించిన దుస్తులు, నగలు, అతిథుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రిపరేషన్స్.. అన్నీ చూసి అందరూ నివ్వెరపోయారు.

Latest Videos


సినీ, రాజకీయ, క్రీడా సెలబ్రెటీలు ఒకరు, ఇద్దరు కాదు.. అందరూ ఈ పెళ్లిలో కనిపించినవారే. ఇంత గ్రాండ్ గా పెళ్లి చేసుకోవడం, చేయడం మనలాంటి వాళ్ల వాళ్ల కాదు అని ప్రతి సామాన్యుడు అనుకుంటూనే ఉంటాడు. మనం ఎంతో గ్రాండ్ గా జరిగింది అనుకుంటున్న ఈ పెళ్లిని.. ముకేష్ అంబానీ కోణంలో చాలా మాత్రం చాలా సింపుల్ అట. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. చాలా అంటే.. చాలా సింపుల్ గా ముకేష్ అంబానీ ఈ పెళ్లి జరిపించినట్లు సర్వేలో తేలడం గమనార్హం.
 


ప్రపంచ ప్రఖ్యాత గాయకుడు జస్టిన్ బీబర్ భారతదేశానికి వచ్చారు. అనంత్  పెళ్లిలో పాడినందుకు దాదాపు 80 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. అలాగే 10 నుంచి 25 కోట్లు అందుకున్న పలువురు పాప్ మ్యూజిక్ ఆర్టిస్టులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొనడం గమనార్హం. అందుకే ఆనంద్ పెళ్లికి ప్రీ వెడ్డింగ్, ఫుడ్, వెడ్డింగ్ ఇలా దాదాపు 5000 నుంచి 5500 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇన్ని కోట్లు ఖర్చు చేసి పెళ్లి చేస్తే.. సింపుల్ వెడ్డింగ్ అని ఎందుకు అంటున్నారు అనే సందేహం మీకు కలగొచ్చు. కానీ.. ముకేష్ కోణంలో, ఆయన సంపాదనను బట్టి చూస్తే.. చాలా సింపుల్ గా చేసినట్లేనట.
 


ఒక సగటు భారతీయ కుటుంబం వారి సంపదలో దాదాపు 10 నుండి 18 శాతం వరకు తమ పిల్లల పెళ్లి కోసం వెచ్చిస్తోంది. అంటే కోటి రూపాయల నికర విలువ కలిగిన వ్యక్తి తన కొడుకు లేదా కూతురి పెళ్లికి దాదాపు 10 లక్షలు ఖర్చు చేస్తాడు.

2023 నాటికి ముఖేష్ అంబానీ సంపద దాదాపు 7.65 లక్షల కోట్లు. 5500 కోట్లు అంటే తన కొడుకు పెళ్లికి ఖర్చు చేసిన దానిలో 0.5 శాతం కూడా కాదు. అంటే.. ఆయన తన కొడుకు పెళ్లి సింపుల్ గా చేసినట్లే కదా. గతంలో.. ముకేష్ అంబానీ తన కుమార్తె ఇషా పెళ్లికి కూడా ఇదే ఫార్ములా వాడారు. తన సంపాదనలో 0.5శాతం కూడా కూతురు పెళ్లికి ఖర్చు చేయలేదు. ఇప్పుడు చెప్పండి.. ఇది సింపుల్ వెడ్డింగ్ అవునో కాదో..!

click me!