తండ్రైన బిగ్ బాస్ మానస్, కొడుక్కి నామకరణం.. రాంచరణ్ సినిమా పేరు పెట్టాడుగా..

First Published | Nov 25, 2024, 2:52 PM IST

బిగ్ బాస్ సీజన్ 5 లో మానస్ టాప్ కంటెండర్ గా నిలిచాడు. మెచ్యూరిటీ గేమ్ తో అందరిని ఆకట్టుకున్నాడు.  బుల్లితెరపై, సోషల్ మీడియాలో మానస్ క్రేజీ స్టార్ గా మారాడు. టివి సీరియల్స్ లో నటిస్తూనే అప్పుడప్పుడూ మ్యూజిక్ వీడియోలు సైతం చేస్తున్నాడు.

 బిగ్ బాస్ సీజన్ 5 లో మానస్ టాప్ కంటెండర్ గా నిలిచాడు. మెచ్యూరిటీ గేమ్ తో అందరిని ఆకట్టుకున్నాడు.  బుల్లితెరపై, సోషల్ మీడియాలో మానస్ క్రేజీ స్టార్ గా మారాడు. టివి సీరియల్స్ లో నటిస్తూనే అప్పుడప్పుడూ మ్యూజిక్ వీడియోలు సైతం చేస్తున్నాడు. విష్ణుప్రియాతో కలసి జరీ జరీ పంచె కట్టి అనే సాంగ్ లో మానస్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు.  

మల్టీ ట్యాలెంటెడ్ అయిన మానస్ గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. శ్రీజ అనే అమ్మాయిని మానస్ గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం మానస్ ఫ్యామిలిలో సంతోషం వెళ్లి విరిసింది. మానస్ భార్య శ్రీజ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 


తాజాగా మానస్ తన కొడుకుని అభిమానులుకు ప్రపంచానికి పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ పోస్ట్ చేశారు. మానస్, శ్రీజ దంపతులు తమ కొడుక్కి నామకరణం చేశారు. నామకరణోత్సవం కనుల పండుగలా జరిగింది. ఈ దంపతులు తమ బిడ్డని చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

ఇంతకీ మానస్ తన కొడుకుకి ఏం పేరు పెట్టాడో తెలుసా.. రాంచరణ్ నటించిన మూవీ పేరు.. అదే 'ధృవ'. వెల్కమ్ తో ధృవ నాగులాపల్లి.. ఈ అనంత విశ్వంలో చిన్న కాంతి కిరణం పుట్టింది అంటూ మానస్ తన కొడుకు గురించి పోస్ట్ చేశారు.

Latest Videos

click me!