మన దేేశ కుబేరుడు ముఖేష్ అంబానీకి పరిచయం అవసరం లేదు. ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తల్లో ఆయన కూడా ఒకరు. అంబానీ కుటుంబం రూ.15వేల కోట్ల విలువైన ఆంటిలియా ఇంట్లో నివసిస్తుంది.
27 అంతస్తుల ఈ భవనంలో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. పటిష్టమైన భద్రతతో ఉండే ఈ నివాసంలో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారు. కాగా, ఈ ఇంటిలో ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ కి 4వేల రోటీలు తయారు చేస్తారట. కేవలం ఈ రోటీలు చేసేందుకు ఒక స్పెషల్ కుక్ ని కూడా ఏర్పాటు చేశారట.