మీరు ఇండియా గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ నగరాలు చూడాల్సిందే

Published : Jun 02, 2025, 11:22 PM IST

వివిధ రకాల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం భారతదేశం. మీరు వీటి గురించి, ఇవి పాటించే ప్రాంతాల ప్రజల గురించి తెలుసుకోవాలంటే ఇండియాలో ఎక్కడెక్కడికి వెళ్లాలో తెలుసా? ఆ ప్రదేశాలు, వాటి ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి. 

PREV
16
కోల్‌కతా

సాహిత్య, కళాత్మక వారసత్వానికి ప్రసిద్ధి కోల్‌కతా నగరం. చరిత్ర, ఆధునికత సహజీవనం చేసే నగరం ఇది. వలసరాజ్యాల కాలం నాటి గొప్ప భవనాలు, సందడిగా ఉండే పుస్తక మార్కెట్లు, ప్రసిద్ధ దుర్గా పూజ ఉత్సవం ఈ నగరం ప్రత్యేకతలు. పర్యాటకులు, భారతదేశ సంస్కృతిని ఇష్టపడే వారు ఈ నగరాన్ని తప్పనిసరిగా చూడాలి.

26
జైపూర్

జైపూర్ లో రాజభవనాలు, ఆశ్చర్యపరిచే వాటి నిర్మాణ శైలి, వివిధ రకాల బజార్లు రాజస్థాన్ వారసత్వం గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. ఈ నగరం బ్లాక్-ప్రింటెడ్ వస్త్రాలు, నీలిరంగు పింగాణీ, సాంప్రదాయ రాజస్థానీ వంటకాలకు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలో రాజుల గత వైభవానికి ప్రత్యక్ష ఉదాహరణ. 

36
ఖజురహో

ఖజురహో దేవాలయాలు దేవతల విశేషాలను తెలియజేస్తాయి. అంతేకాకుండా ప్రజలు ఎలా జీవించాలన్న విధానాన్ని వర్ణించే వివరణాత్మక శిల్పాలకు ప్రసిద్ధి చెందాయి. 9, 11వ శతాబ్దాల మధ్య నిర్మించిన ఈ నిర్మాణాలు భారతదేశం కళాత్మక నైపుణ్యానికి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకలు.

46
వారణాసి

ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటైన వారణాసి హిందూ ఆచారాలు, శాస్త్రీయ సంగీతం, సాంప్రదాయ సిల్క్ నేతకు కేంద్రం. ఇక్కడ ఇచ్చే గంగా హారతి చూస్తే మంత్రముగ్ధులైపోతాం. జీవితంలో ఒకసారైనా ఈ నగరాన్ని దర్శించాలి. 

56
ముంబై

ముంబై భిన్న సంస్కృతుల కలయిక. బాలీవుడ్ సినిమా రంగుల ప్రపంచం ఒకవైపు, చారిత్రాత్మక ప్రదేశాలు మరో వైపు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఈ నగరం భారతదేశం ఎంత అభివృద్ధి చెందిందో తెలిపే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. రకరకాల మనుషులు, రకరకాల ఆచార వ్యవహారాలు, సంస్కృతులను ఒకే చూడాలనుకుంటే మీరు ముంబై వెళ్లాలి. 

66
చెన్నై

దక్షణ భారతదేశ వైభవాన్ని తెలుసుకోవాలంటే మీరు కచ్చితంగా చెన్నైను సందర్శించాలి. శాస్త్రీయ సంప్రదాయాలైన కర్ణాటక సంగీతం, భరతనాట్యం ఓ వెలుగు వెలిగిన ప్రాంతం ఇది. కవులు, కళాకారులకు నిలయం ఈ నగరం. ఈ నగరంలో ఎన్నో దేవాలయాలు ఆనాటి సంస్కృతికి ఉదాహరణలుగా మిగిలాయి. 

Read more Photos on
click me!

Recommended Stories