శృంగారంలో ఈ సమస్య గురించి అస్సలు మాట్లాడరు.. ఎందుకంటే..

First Published Nov 2, 2021, 1:08 PM IST

చాలా మంది జంటలు పడకగదిలో అనేక లైంగిక సమస్యలను ఎదుర్కొంటారు. కానీ వాటి గురించి బయట చాలా అరుదుగా మాట్లాడతారు. అలాంటివి నిజానికి మాట్లాడకుండా ఉండేలేం. అలాగని బైటికి చెప్పుకోలేం.. ఇలాంటి కొన్ని సాధారణ సమస్యలకు ఆయుర్వేదంలో కొన్ని పరిష్కారాలున్నాయి. అవేంటో చూద్దాం.

సెక్స్ అనేది జీవితంలో అంతర్భాగం. వాస్తవానికి, ఇది పునరుత్పత్తికి, వంశాభివృద్ధికి దోహదపడుతుంది. దీనికోసం సెక్స్ అనేది కీలకం అనేది వాస్తవం.  అయినప్పటికీ, ఇతర శరీర భాగాల మాదిరిగానే, కొన్నిసార్లు, మన సెక్స్ అవయవాలు మనం కోరుకున్న విధంగా పనిచేయకపోవచ్చు. దీనివల్ల ఇబ్బందికి,  అవమానానికి దారితీస్తుంది.

ఈ కారణంగానే చాలా మంది జంటలు పడకగదిలో అనేక లైంగిక సమస్యలను ఎదుర్కొంటారు. కానీ వాటి గురించి బయట చాలా అరుదుగా మాట్లాడతారు. అలాంటివి నిజానికి మాట్లాడకుండా ఉండేలేం. అలాగని బైటికి చెప్పుకోలేం.. ఇలాంటి కొన్ని సాధారణ సమస్యలకు ఆయుర్వేదంలో కొన్ని పరిష్కారాలున్నాయి. అవేంటో చూద్దాం.

పురుషుల్లో నంపుసకత్వం
Male Infertilityకి ప్రధాన కారణం తక్కువ స్పెర్మ్ కౌంట్ లేదా తక్కువ చలనశీలత ఉండడం. దీని కారణంగా ఈ సమస్య ఎదుర్కున్నంటున్న వారి ద్వారా గర్భం రావడం, పిల్లలు పుట్టడంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఇది ఎక్కువ శాతం పురుషులు అతి సాధారణంగా ఎదుర్కునే సమస్య. అయితే ఈ సమస్య ఉన్నవారు దీని గురించి చాలా తక్కువగా మాట్లాడతారు.

అయితే, Ayurveda దీనికి సాధారణ DIY పరిష్కారాన్ని సూచిస్తుంది. అశ్వగంధ పొడి, శతావరి పొడి, తెల్ల ముస్లి పొడి, నల్ల ముస్లి పొడి, కౌచ్ గింజల పొడి, ఉసిరి పొడి.. వీటన్నింటినీ సమాన పరిమాణంలో తీసుకుని కలపాలి.  ప్రతి రాత్రి ఈ మిశ్రమాన్ని10 గ్రాములు గ్లాసుడు పాలలో కలిపి తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫలితాలు మీకే తెలుస్తాయి.. అంటున్నారు. 

శీఘ్ర స్కలనం
Premature ejaculation అనేది చాలా మంది పురుషులను ఇబ్బంది పెట్టే సమస్య. ఇది ఇబ్బందికి గురి చేయడమే కాదు.. అహాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, ఈ రకమైన సమస్య అధిక వేడి (ఉష్ణత) శరీరం ఉన్న పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే  దీన్ని నయం చేయడానికి ఆయుర్వేద నిపుణులు కొన్ని ఆహార మార్పులను సిఫార్సు చేస్తున్నారు. 

సముద్రపు ఉప్పు, టీ, కాఫీ, కారంగా ఉండే ఆహారాలు తీసుకోవడం మానేయాలి, ఈ రకమైన ఆహారాలు శరీరంలో వేడిని పెంచుతాయి, ఇది సమస్యకు ముఖ్య కారణమవుతుంది. బదులుగా, పెరుగు, పుదీనా, ధనియా చట్నీ తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. 

ఈ dietary changesను పక్కన పెడితే, ఉదయం 20 మి.లీ ఉషిరసవ్, సాయంత్రం 20 మి.లీ సమాన భాగాల నీటితో ఆహారం తీసుకున్న 15 నిమిషాల తర్వాత తీసుకోవచ్చు. ఆహారం తీసుకున్న 30 నిమిషాల తర్వాత చంద్రప్రభావతి, గోక్షురాది గుగ్గులు రెండూ కలిపి రెండు మాత్రలను నీటితో తీసుకోవాలి.

లిబిడో లేకపోవడం
లిబిడో లేదా సెక్స్ డ్రైవ్ లేకపోవడం అనేది పురుషులు, మహిళలు ఇద్దరిలో ఒక సాధారణ సమస్య. అందుకే వీటికి ఆయుర్వేద నివారణలే కూడా స్త్రీ, పురుషులిద్దరికీ దాదాపు ఒకేలా ఉంటుంది. ఆయుర్వేదం ఈ సమస్యను రెండు ప్రధాన కారణాలతో చెబుతుంది.

ఒత్తిడి, ఆందోళన.. తీవ్రమైన జీవనశైలి.. శారీరక బలహీనత
మొదటి సందర్భంలో, ఉదయం 2 గ్రాముల బ్రహ్మీ చూర్ణం, సాయంత్రం 2 గ్రాముల బ్రహ్మీ చూర్ణం పాలతోపాటు తప్పనిసరిగా ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇక రెండో విధానంలో, రాత్రి పడుకునే సమయంలో పాలతో కలపి 1 టీస్పూన్ త్రిఫల ఘృతాన్ని తీసుకోవాలి. రాత్రిపూట 5 గ్రాముల శతావరి పొడిని పాలతో పాటు 2 మాత్రల చంద్రప్రభ కూడా కలిపి తీసుకోవచ్చు.

ఇక ఉదయం, రాత్రి పూట అన్నం తిన్న 20 నిమిషాల తరువాత 20 ml అశ్వగంధారిష్ట తీసుకోవాలి. ఇది పురుషులు, మహిళలు ఇద్దరికీ ఒకే విధంగా ఉంటాయి. వీరిద్దరికీ వీటి నుండి ప్రయోజనాలు పొందుతారు. 

స్త్రీలలో నంపుసకత్వం...
Female infertility అనేది ఒక సాధారణ సమస్య. అయితే దీనిని 'శతవ్రి' అని పిలిచే మాంత్రిక ఔషధంతో నయం చేయవచ్చు. ఇది సంతానోత్పత్తిని పెంచడంతో పాటు, స్త్రీ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే మానసిక,  శారీరక ఒత్తిళ్లను తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుందని నిరూపించబడింది.

infertilityతో పోరాడుతున్న మహిళలు ప్రతిరోజూ వేడి, మసాలా పాలతో 2 శతావరి గుళికలను తీసుకోవడం ద్వారా  చికిత్సను ప్రారంభించవచ్చు.

స్త్రీలలో లైంగిక అసమర్థత
గోక్షుర అనేది ఆయుర్వేద ఔషధం. ఇది Female sexual dysfunctionకు చికిత్స చేయడంలో విజయవంతమైంది. DARU జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ లో ఇటీవలి ప్రచురించిన అధ్యయనంలో, మహిళలు కేవలం 4 వారాలు మాత్రమే ఈ మూలికను తీసుకోవడం ద్వారా మెరుగైన సరళత, ఉద్రేకం, లైంగిక కోరిక, సంతృప్తిని నమోదు చేసుకున్నారు.

పైన పేర్కొన్న ఏవైనా సమస్యలను ఎదుర్కొంటున్న స్త్రీలు ¼ నుండి ½ టీస్పూన్ గోక్షుర చూర్ణాన్ని తేనె లేదా పాలతో రోజుకు రెండుసార్లు తీసుకోవచ్చు.

ఏది ఏమైనప్పటికీ, ఈ నివారణలలో వేటినైనా పాటించే ముందు అవసరమైన అన్ని జాగ్రత్తలు పాటించాలని, శరీరంలో వేడిని పెంచే ఆహారాన్ని తినకుండా ఉండాలని గుర్తుంచుకోవాలి. 

ఈ అన్ని సమస్యలకు రకరకాల నివారణలు ఉన్నాయి. వీటికి పరిష్కారాలూ ఉన్నాయి. అయితే వీటిలో ఏదైనా సరే ప్రయత్నించే ముందు ఒకసారి మీ వైద్యులను సంప్రదించడం ముఖ్యం. సెకండ్ ఒపినీయన్ తీసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. 

భర్త భార్య మాట వినాలంటే ఏం చెయ్యాలి.. ఎలా ఉండాలి!

click me!