వీటితో మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది.. ఆరోగ్య సమస్యలు మీ దరిచేరవు...

First Published Aug 3, 2021, 4:15 PM IST

అధిక రక్తపోటు ఉందని గుర్తించిన తరువాత చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇది ప్రాణాలకే ముప్పుగా వాటిల్లుతుంది. రక్తపోటు స్థాయిని నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మందులనేది అందులో ఒక మార్గం మాత్రమే.

బీపీ.. బ్లెడ్ ప్రెజర్ లేదా రక్తపోటు.. ఇది అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఈ అధిక రక్తపోటు లేదా రక్తపోటుతో బాధపడుతున్నారు. గుండెకు రక్తం సరఫరా చేసే ధమనుల గోడలమీద దీని ప్రభావం పడుతుంది. దీనివల్ల కాలక్రమేణా గుండె దెబ్బతింటుంది. స్ట్రోక్, గుండెపోటు వంటి హృదయ సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది.
undefined
అధిక రక్తపోటు ఉందని గుర్తించిన తరువాత చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఇది ప్రాణాలకే ముప్పుగా వాటిల్లుతుంది. రక్తపోటు స్థాయిని నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మందులనేది అందులో ఒక మార్గం మాత్రమే. ఒత్తిడిని నియంత్రించడం ద్వారా దీర్ఘకాలంలో ఈ సమస్యనుంచి బయటపడొచ్చు. అలాగే సహజసిద్ధంగా బ్లడ్ ప్రెషర్ నుంచి బయటపడే మార్గాలూ ఉన్నాయి. వాటిల్లో 5 మీకోసం..
undefined
సోడియం తీసుకోవడం తగ్గించాలి : అనేక అధ్యయనాలు అధిక రక్తపోటును అధిక సోడియం తీసుకోవడంతో ముడిపెడతాయి. స్ట్రోక్‌కి సోడియం కూడా ఒక కారణం కావచ్చు. రోజువారీ సోడియం తీసుకోవడంలో చిన్న తగ్గింపు కూడా అధిక రక్తపోటు విషయంలో 5 నుండి 6 ఎమ్ఎమ్ హెచ్ జీ వరకు ఒత్తిడిని తగ్గిస్తుంది. సోడియం తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటాయి. మామూలుగా కూడా ఉప్పును తక్కువగా తీసుకోవడం మంచిది. ప్రాసెస్డ్ ఫుడ్ లో మనకు తెలియకుండానే సోడియం ఎక్కువగా ఉంటుంది. అందుకే అలాంటి ఆహారాలకు దూరంగ ఉండాలి. సాధారణ వ్యక్తులు ఒక రోజులో 2,300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉప్పును తీసుకోకూడదు.
undefined
పొటాషియం తీసుకోవడం పెంచాలి : అధిక రక్తపోటుతో బాధపడే వారందరికీ పొటాషియం ఒక ముఖ్యమైన పోషకం. శరీరానికి అవసరమైన ఈ మినరల్ అదనపు సోడియం వదిలించుకోవడానికి సహాయపడుతుంది. రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేసిన ఆహారాలలో ఎక్కువగా సోడియం ఉంటుంది. దీన్ని బాలెన్స్ చేయడానికి మీరు ఆహారంలో పొటాషియం అధికంగా ఉండే పదార్థాలను జోడించాలి.
undefined
పొటాషియం ఎక్కువగా ఉండే కొన్ని రకాల ఆహారపదార్థాలు.. కూరగాయలు : ఆకు కూరలు, టమోటాలు, బంగాళాదుంపలు, చిలగడదుంపలు పండు : పుచ్చకాయలు, అరటిపండ్లు, అవోకాడో, నారింజ, నేరేడు పండు ఇవే కాకుండా నట్స్, సీడ్స్, పాలు, పెరుగు, ట్యూనా, సాల్మన్ లాంటి వాటిల్లో పొటషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇవి మీ శరీరానికి కావాల్సిన పొటాషియం అందించి రక్తపోటును అదుపులో ఉండేలా చేస్తాయి.
undefined
క్రమం తప్పని వ్యాయామం :ప్రతి వ్యక్తికి రెగ్యులర్ వ్యాయామం కీలకం. ఆరోగ్యంగా ఉండటానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా 30 నుండి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారందరికీ ఇది మరింత అవసరం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీ గుండె బలంగా తయారవుతుంది, రక్తాన్ని మరింత సమర్ధవంతంగా పంప్ చేయడంలో.. ధమనులపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండడానికి ప్రతిరోజూ 40 నిమిషాలు నడవడం కూడా అవసరమే.
undefined
మద్యం - ధూమపానం : సిగరెట్లు, ఆల్కహాల్ రెండూ అధిక రక్తపోటుకు దోహదం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా 16 శాతం అధిక రక్తపోటు కేసులకు ఆల్కహాల్ దోహదం చేస్తుందని పరిశోధనలో తేలింది. ఆల్కహాల్, నికోటిన్ రెండూ తాత్కాలికంగా రక్తపోటు స్థాయిని పెంచుతాయి. రక్త నాళాలను దెబ్బతీస్తాయి. రెండు విషయాలు మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి కాబట్టి... మంచి కోసం ఒకసారి వాటిని వదిలేయడం మంచిది.
undefined
ఈ పిండి పదార్థాలను తగ్గించాలి : ఇటీవలి అనేక నివేదికల ప్రకారం రిఫైన్డ్ పిండి పదార్థాలు, ఆహారాలలో చక్కెర జోడించడం కూడా అధిక రక్తపోటుకు దోహదం చేస్తాయని సూచిస్తున్నాయి. అలాంటి ఓ రెండు ఆహార పదార్థాల తీసుకోవడం తగ్గించడం వలన రక్తపోటు స్థాయిని సహజంగా తగ్గించవచ్చు. అవే బ్రెడ్, వైట్ షుగర్. ఇవి మీ ఆహారాలను రక్తంలో చేరగానే వేగంగా చక్కెరగా మారతాయి. దీంతో అనేక సమస్యలను కలిగిస్తాయి. అధిక రక్తపోటు ఉన్నవారు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకోవాలని తద్వరా బరువు తగ్గాలని సూచించారు. రిఫైన్డ్ ఫ్లోర్ కు బదులుగా, హోల్ గ్రెయిన్స్... తెల్ల చక్కెరకు బదులుగా బెల్లం లేదా తేనెవాడొచ్చు.
undefined
click me!