రాత్రి భోజనంలో ఈ కూరలు తింటే అరుగుదల ఇబ్బందులు ఉండవు.. హాయిగా నిద్రపడుతుంది

Published : May 25, 2025, 12:51 PM IST

పగలు ఎలా ఉన్నా రాత్రి తిన్నది సరిగ్గా అరిగితేనే ఆరోగ్యంగా ఉండగలం. రాత్రి పూట ఏం తింటే ఆరోగ్యంగా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం.   

PREV
15
ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం

ఏం తిన్నా హాయిగా అరిగిపోతే వాళ్లంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. ఎందుకంటే ఈ కాలంలో ఆరోగ్యం కాపాడుకోవడం పెద్ద టాస్క్ లా మారిపోయింది. తింటే ఆయాసం… తినకపోతే నీరసం అన్న మాదిరిగా శరీరాలు తయారయ్యాయి. అందుకే మంచి ఆహారం తినేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

25
సాంబార్

సాంబార్ దక్షిణ భారతదేశంలో అత్యంత ముఖ్యమైన, ప్రసిద్ధ వంటకాల్లో ఒకటి. పప్పు, చింతపండు, వంకాయ, మునక్కాయ, బెండకాయ, గుమ్మడికాయ వంటి కూరగాయలు, సాంబార్ పొడి ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. సాంబార్ లో ఉండే పప్పు ప్రోటీన్ ఇస్తుంది. కూరగాయలు విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. అన్నం, ఇడ్లీ, దోశ, వడలతో కలిపి తినడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాత్రి భోజనం దీంతో తినడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. అరుగుదల సమస్యలు ఉండవు. 

35
రసం

రసం కూడా సాంబార్ లాగే చాలా ఫేమస్ వంటకం. చింతపండు, టమాటా, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఇతర మసాలా దినుసులతో తయారుచేస్తారు. రసం జీర్ణక్రియకు చాలా మంచిది. జలుబు, జ్వరం వంటి సమయాల్లో రసం మంచి ఔషధంగా పనిచేస్తుంది. మిరియాలు, జీలకర్ర ఉండటం వల్ల శరీరంలోని వ్యర్థాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని అన్నంలో కలుపుకుని, లేదా సూప్ లాగా కూడా తాగవచ్చు.

45
టమాటా కూర

రుచికరంగా, పుల్లపుల్లగా ఉండే కూర టమాటా కూర. ఇది కూడా రాత్రి తినడానికి చాలా మంచిది. దీన్ని తయారు చేయడానికి టమాటాలు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి ముద్ద, వివిధ మసాలా దినుసులు ఉపయోగిస్తారు. కొన్నిసార్లు కొబ్బరిపాలు లేదా జీడిపప్పు ముద్ద కలిపి దీన్ని మరింత క్రీమీగా చేస్తారు. ఇది చపాతీ, పూరి, ఇడ్లీ, దోశ, అన్నం వంటి వాటితో కలిపి తినడానికి బాగుంటుంది. త్వరగా అరిగిపోయే ఆహార పదార్థాల్లో ఇది కూడా ఒకటి. 

మిక్స్‌డ్ వెజిటబుల్ కూర

బంగాళదుంప, క్యారెట్, బీన్స్, బఠానీలు వంటి వివిధ రకాల కూరగాయలు కలిపి మిక్స్‌డ్ వెజిటబుల్ కర్రీ తయారు చేస్తారు. దీనికి కొబ్బరిపాలు, జీడిపప్పు, గసగసాలు, మసాలా దినుసులు కలిపి తయారు చేస్తే క్రీమీగా అవుతుంది. ఇది చపాతీ, పరాఠా, పూరి లేదా అన్నంతో కలిపి తినడానికి చాలా బాగుంటుంది. రాత్రి పూట తిన్నా త్వరగా అరిగిపోతుంది. 

55
మజ్జిగ చారు

మజ్జిగ చారు కూడా జీర్ణక్రియకు చాలా మంచిది. పెరుగు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, అల్లం, మసాలా దినుసులు కలిపి దీన్ని తయారు చేయొచ్చు. మజ్జిగ శరీరాన్ని చల్లబరుస్తుంది. వేసవి కాలంలో రాత్రి పూట కడుపునిండా మజ్జిగ అన్నం తింటే  ఆరోగ్యంతో పాటు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లు రాకుండా ఉంటాయి.  

Read more Photos on
click me!

Recommended Stories