Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్

Published : Sep 16, 2026, 12:19 PM IST

Tariffs: రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై 100 శాతానికి పైగా సుంకాలు విధించేలా ట్రంప్‌కు సర్వాధికారాలు ఇచ్చే సాంక్షన్ బిల్‌ను యూఎస్ ప్రతినిధుల సభ ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు ఇదే అంశం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది.

PREV
15
భారత్‌కు భారీ గండం? 100% టారిఫ్‌లతో అమెరికా కొత్త ప్లాన్

రష్యా నుంచి క్రూడ్ అయిల్ దిగుమతి చేసుకుంటున్న భారత్ సహా ఇతర దేశాలకు అమెరికా పెద్ద షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై ఏకంగా 100 శాతం వరకు దిగుమతి సుంకాలు విధించే అధికారాన్ని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కట్టబెట్టే కీలక బిల్లు అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఒక అడుగు ముందుకు పడింది.

మంగళవారం సాయంత్రం జరిగిన కీలక ప్రక్రియాత్మక ఓటింగ్‌లో ఈ బిల్లు 214-211 ఓట్ల తేడాతో నెగ్గింది. డెమొక్రాట్ పార్టీ నాయకత్వాన్ని ఆశ్చర్యపరుస్తూ ఇద్దరు డెమొక్రాట్ ప్రతినిధులు రిపబ్లికన్లకు సపోర్టుగా ఓటు వేయడంతో ఈ బిల్లు క్లియర్ అయి, చివరి ఓటింగ్‌కు మార్గం సుగమమైంది.

25
లూథర్ గ్రాహం శాంక్షనింగ్ యాక్ట్ 2026 కథేంటి?

'లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026' (Lindsey O Graham Sanctioning Russia and Iran Act of 2026) పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లు రష్యాపై ఆర్థికంగా మరింత ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడానికి రష్యాకు ప్రధాన ఆదాయ వనరు ముడి చమురు వ్యాపారమేనని అమెరికా బలంగా నమ్ముతోంది. అందుకే రష్యా ఆయిల్ రంగంతో పాటు, ఆ ఆయిల్‌ను రహస్యంగా సరఫరా చేసే షాడో ఫ్లీట్ నౌకలపై కూడా ఆంక్షలు విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.

అంతేకాకుండా రష్యా నుంచి ఎక్కువ పరిమాణంలో ఇంధనాన్ని కొనుగోలు చేసే ఐదు ప్రధాన దేశాలపై 100 శాతం వరకు పెనాల్టీ టారిఫ్‌లు విధించే హక్కును యూఎస్ ప్రెసిడెంట్‌కు ఈ చట్టం ఇస్తుంది. గత ఆగస్టులో ఈ బిల్లు సెనెట్‌లో 86-11 ఓట్ల భారీ మెజారిటీతో ఇప్పటికే ఆమోదం పొందింది.

35
ఈ లిస్టులో భారత్‌తో పాటు ఉన్న దేశాలేవి?

ఆగస్టు 7న సెనెట్ ఆమోదించిన వెర్షన్‌లో ఏ దేశం పేరునూ నేరుగా ప్రస్తావించకుండా "అత్యధికంగా చమురు కొనే టాప్ 5 దేశాలు" అని పేర్కొన్నారు. అయితే హౌస్ సవరణల సమయంలో భారత్, చైనాతో పాటు అజర్‌బైజాన్, హంగేరీ, స్లొవేకియా వంటి దేశాలు ఈ జాబితాలో ప్రధానంగా ఉన్నట్లు స్పష్టమైంది. రష్యా నుంచి తక్కువ ధరకు లభించే క్రూడ్ ఆయిల్‌ను కొనుగోలు చేయడంలో భారత్, చైనాలు ముందువరసలో ఉన్నాయి.

మరోవైపు ఇరాన్‌పై ఉన్న పాత ఆంక్షలను కూడా 2031 వరకు పొడిగించే నిబంధనలను ఈ బిల్‌లో చేర్చారు. మిడ్ టెర్మ్ ఎన్నికల నిమిత్తం ప్రతినిధుల సభ గురువారం నుంచి సెలవుల్లోకి వెళ్లనున్న నేపథ్యంలో, ఆలోపే ఈ బిల్లును ఆమోదించి ట్రంప్ సంతకానికి పంపాలని అమెరికా చట్టసభ సభ్యులు భావిస్తున్నారు.

45
అమెరికా ప్రజాప్రతినిధుల ఘర్షణ

ఈ బిల్లుపై అమెరికా రాజకీయంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ట్రంప్‌కు చెక్‌లు, బ్యాలెన్స్‌లు లేకుండా టారిఫ్‌లు విధించే అపరిమిత అధికారాలు ఇవ్వడం సరికాదని డెమొక్రాట్ సీనియర్ నాయకుడు గ్రెగొరీ మీక్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రెసిడెంట్ ఈ అధికారాలను దుర్వినియోగం చేస్తే అమెరికాలోని వినియోగదారులపైనే వస్తువుల ధరల భారం పడుతుందని, సరఫరా గొలుసు దెబ్బతింటుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయినప్పటికీ, ఉక్రెయిన్‌కు సపోర్టు ఇచ్చే వివిధ లాబీ గ్రూపులు వాషింగ్టన్‌లో నిరసనలు, లాబీయింగ్ వేగవంతం చేయడంతో ఈ బిల్లు ముందుకు కదిలింది.

55
భారత్ రెస్పాన్స్ ఏంటి?

తన నిర్ణయాన్ని భారత్ మొదటి నుంచీ చాలా స్పష్టంగా సమర్థించుకుంటోంది. దేశ ఇంధన భద్రత, భారతీయుల అవసరాలు, అంతర్జాతీయ మార్కెట్లో లభించే చమురు ధరలను బట్టే తమ నిర్ణయాలు ఉంటాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రష్యాతో ఇంధన సంబంధాలు తమ ద్వైపాక్షిక బంధంలో అత్యంత కీలకమైన భాగమని భారత్ స్పష్టం చేసింది.

ఒకవేళ ఈ బిల్లు చట్టంగా మారినా, 100 శాతం టారిఫ్ అనేది గరిష్ఠ పరిమితి మాత్రమే. పరిస్థితులను బట్టి ఎంత శాతం పన్ను విధించాలి, లేదా అసలు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలా అనేది యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు. మరోవైపు భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చర్చలు ముగింపు దశలో ఉన్న వేళ ఈ టారిఫ్ హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories