Trump Tariff India: భార‌త్ పాకిస్థాన్‌పై ఆధార‌ప‌డే రోజు వ‌స్తుందా.? ట్రంప్ కుట్ర‌, అస‌లేం జ‌రుగుతోంది.?

Published : Jul 31, 2025, 10:07 AM ISTUpdated : Jul 31, 2025, 11:14 AM IST

భార‌త్ త‌న‌కు మిత్ర దేశం అంటూనే మ‌న‌కు కీడు చేసే చ‌ర్య‌ల‌కు దిగుతున్నారు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌. భార‌త్‌పై సుంకాలు పెంచ‌డ‌మే కాకుండా పాకిస్థాన్‌కు ల‌బ్ధి చేకూరే చ‌ర్య‌ల‌కు దిగుతున్నారు. 

PREV
15
అమెరికా-పాకిస్థాన్ చ‌మురు ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌తో భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి సంయుక్త ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భవిష్యత్తులో భారత్‌కూ చమురు అమ్మే అవకాశముందని ట్రంప్ వ్యాఖ్యానించారు. భార‌త్‌పై 25 శాతం టారిఫ్‌లు ప్రకటించిన కొన్ని గంటలకే ట్రంప్ ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

25
భారత్‌పై 25% టారిఫ్‌ల తర్వాత కొత్త డీల్

బుధవారం ట్రంప్ భారత్ నుంచి దిగుమతులపై 25 శాతం సుంకం, అదనపు పెనాల్టీ విధించినట్లు ప్రకటించారు. ఆ త‌ర్వాత కాసేప‌టికే పాకిస్థాన్‌తో చమురు నిల్వల అభివృద్ధికి సంయుక్త భాగస్వామ్యాన్ని ప్రకటించారు. పాకిస్థాన్‌ను “భారీ చమురు నిల్వలున్న దేశం”గా ట్రంప్ అభివ‌ర్ణించ‌డం గ‌మ‌నార్హం.

35
భార‌త్‌కు చ‌మురు అమ్మే రోజు రావొచ్చు

ఇంత‌టితో ఆగ‌ని ట్రంప్ సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ విష‌య‌మై ఆయ‌న.. “అమెరికా–పాకిస్థాన్ మధ్య చమురు అభివృద్ధి ప్రాజెక్ట్‌ కోసం ఒప్పందం కుదిరింది. ప్రాజెక్ట్‌ను నడిపించే కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు పాకిస్థాన్ భారత్‌కి కూడా చమురు అమ్మవచ్చు!” అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే సుంకాల కారణంగా అమెరికా-భారత్ వాణిజ్య సంబంధాలు కఠినంగా మారవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్ ట్వీట్

45
దక్షిణ కొరియాతో చర్చలు

ఇతర దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. దక్షిణ కొరియా ప్రతినిధి బృందంతో 25 శాతం టారిఫ్‌లను తగ్గించే అవకాశాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ విష‌య‌మై ట్రంప్ మాట్లాడుతూ.. “మేము చాలా బిజీగా ఉన్నాం. పలు దేశాల నాయకులతో మాట్లాడాను. అందరూ అమెరికాను సంతోషపరచాలనుకుంటున్నారు,” అని చెప్పుకొచ్చారు.

55
ఇతర దేశాలూ సుంకం తగ్గింపు కోరుతున్నాయి

ఇక ప్ర‌పంచంలోని ప‌లు దేశాలు సుంకాలు త‌గ్గించ‌మ‌ని కోరుతున్న‌ట్లు ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే ప్రతిపాదనలు ఇస్తున్నాయి. “ఈ ఒప్పందాలు వాణిజ్య లోటును తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. పూర్తి వివరాలు తగిన సమయంలో వెల్లడిస్తాం,” అని ట్రంప్ వెల్ల‌డించారు.

Read more Photos on
click me!

Recommended Stories