హాస్పిటల్స్‌లో కూడానా... ఆస్పత్రుల్లో సెక్స్ వద్దని ప్రజలకు ప్రధాని వేడుకోలు

First Published Sep 10, 2021, 6:42 PM IST

కరోనా కట్టడిలో సక్సెస్ స్టోరీగా హెడ్‌లైన్స్‌లో నిలిచిన న్యూజిలాండ్‌లో ఓ విచిత్ర సమస్య వచ్చిపడింది. కొందరు విజిటింగ్ అవర్స్‌లో పేషెంట్ల దగ్గరకు వెళ్లి వారితో సెక్స్ చేసి వస్తున్నట్టు కథనాలు వచ్చాయి. ఈ విషయంపై న్యూజిలాండ్ ప్రభుత్వం సీరియస్ అయింది. కొవిడ్ టైమ్‌లో సెక్స్ హై రిస్క్ యాక్టివిటీ అని స్పష్టం చేసింది. హాస్పిటల్స్‌లో శారీరకంగా కలవొద్దని ఆదేశించింది.
 

వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌లో విచిత్ర పరిస్థితి ఎదురైంది. పేషెంట్ల దగ్గరకు విజింట్ అవర్స్ కింద వెళ్లే వారు సెక్స్ చేసి వస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో ప్రభుత్వం సీరియస్ అయింది. కరోనా టైమ్‌లో సెక్స్ సీరియస్ విషయమని పేర్కొంది. హాస్పిటల్స్‌లో సెక్స్ చేసుకోవద్దని సూచించింది. ఈ కార్యంతో బలహీనులైన పేషెంట్లు మహమ్మారి బారినపడే ముప్పు ఉంటుందని తెలిపింది. సెక్స్ హైరిస్క్ యాక్టివిటీ అని స్పష్టం చేసింది.

ఆక్లాండ్‌లోని ఓ హాస్పిటల్‌లో సెక్స్‌పై ఫిర్యాదు నమోదైన తర్వాత ప్రధాన మంత్రి జెసిండా అడార్న్ ఈ హెచ్చరిక జారీ చేశారు. నలుగురున్న హాస్పిటల్‌ గదిలోకి ఓ మహిళ వచ్చిందని, వచ్చీరాగానే కర్టెయిన్‌ల వెనక్కి వెళ్లిపోయిందని ఆ వార్డులోని ఓ వ్యక్తి మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. తెరల వెనుక ఏం జరిగిందో మరి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని వివరించారు. ఈ చర్య మిగిలిన వారందరికీ ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. వాళ్ల క్రీడను డిస్టర్బ్ చేయవద్దని అనేవారూ కొందరు ఉంటారేమో కానీ, కొవిడ్ సమయంలో ఇది తీవ్రమైన అంశమేనని ఫిర్యాదుదారుడు అభిప్రాయపడ్డారు.

ఇదే విషయాన్ని ఓ రిపోర్టర్ కొవిడ్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్న ప్రధానమంత్రి జెసిండా అడార్న్, హెల్త్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అశ్లీ బ్లూమ్‌ఫీల్డ్‌ల ముందు లేవనెత్తారు. ఈ ఫిర్యాదు ప్రస్తావనతో ప్రధాని జెసిండా అడార్న్ ఖంగుతిన్నారు. వారిరువురినీ కొంతసేపు నిశబ్దమైపోయారు.
 

వెంటనే తేరుకున్న హెల్త్ డైరెక్టర్ జనరల్ ప్రస్తుత పరిస్థితుల్లో అది చాలా రిస్కీ యాక్టివిటీ అని తెలిపారు. ఇది కరోనా సోకే హై రిస్క్ యాక్టివిటీ అని చెప్పారు. కొవిడ్ ఉన్నా లేకున్నా.. విజిటింగ్ అవర్స్‌లో ఇలాటి విచిత్ర కార్యాలు ఉండవనే భావిస్తున్నా అని ప్రధాని జెసిండా అన్నారు.

హాస్పిటల్‌లోని పేషెంట్ల కోసం విజిటర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, విజిటర్ల సంఖ్యపై పరిమితి విధించాలని న్యూజిలాడ్ నర్స్ ఆర్గనైజేషన్ సూచన మేరకు ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ను సవరించింది. బెడ్‌కు ఇద్దరికి మించి విజిటర్లను అనుమతించవద్దని స్పష్టం చేసింది.

2020, 2021 తొలినాళ్లలో కరోనాను నియంత్రించడంలో, దాని వ్యాప్తిని కట్టడి చేయడంలో న్యూజిలాండ్ ఒక సక్సెస్ స్టోరీగా చెలామణిలో ఉంది. కరోనా విపరిణామాలను చాలా వరకు ఈ దేశం దరికి చేరనివ్వలేదు. కానీ, డెల్టా వేరియంట్ ఈ సీన్ మార్చేసింది. పొరుగుదేశం ఆస్ట్రేలియా నుంచి డెల్టా వేరియంట్ న్యూజిలాండ్‌లోకి పాకింది. కేసులు మళ్లీ రిపోర్ట్ కావడం షురూ అయ్యాయి. ఆక్లాండ్ వెలుపలా మొన్నటి వరకూ కఠిన లాక్‌డౌన్ అమలయింది. ప్రస్తుతం ఆక్లాండ్‌లో లాక్‌డౌన్ అమలవుతూనే ఉన్నది.

click me!