Donald Trump: భార‌త్‌పై సుంకాలు పెంచితే ర‌ష్యా యుద్ధాన్ని ఆపేస్తుందా.?

Published : Aug 07, 2025, 10:30 AM IST

ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగుగా చెప్పి ట్రంప్ భార‌త్‌పై విరుచుకుప‌డుతున్నారు. ర‌ష్యా నుంచి భార‌త్ చ‌మురు దిగుమ‌తి ఆప‌క‌పోతే సుంకాలు పెంచుతామ‌ని బెదిరించ‌డ‌మే కాకుండా. ఏకంగా 50 శాతం పెంచి అన్నంత ప‌ని చేశారు. 

PREV
15
మొద‌లైన మాస్కో-వాషింగ్ట‌న్ చ‌ర్చ‌లు

ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు ముగింపు పలకే విధంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్ర‌వారం గ‌డువు విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతోన్న స‌మ‌యంలో మాస్కో-వాషింగ్టన్ మధ్య చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం సాధించే దిశగా కీలక పురోగతి కనిపిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా యుద్ధాన్ని అడ్డుకునేందుకు ఇదే సరైన అవకాశం అని ఆయన అభిప్రాయపడ్డారు

DID YOU KNOW ?
యూఎస్ చ‌రిత్ర‌లో అత్య‌ధికం
ట్రంప్ ప్రభుత్వం భారత ఉత్పత్తులపై 50 శాతం టారిఫ్ విధించింది. ఇది US చరిత్రలో అత్యధికం. భారత విదేశాంగ శాఖ దీన్ని ‘న్యాయసమ్మతం కాదు’ అని ఖండించింది.
25
భార‌త్‌పై సుంకాలే కీల‌కంగా మారిందా.?

ఇదిలా ఉంటే భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు (Tariffs) తాజా చర్చల్లో కీలక అంశంగా మారాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల ప్రకటించిన ఈ అధిక టారిఫ్‌ల కార‌ణంగానే ర‌ష్యా చ‌ర్చ‌ల‌కు వ‌చ్చిన‌ట్లు ట్రంప్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ విష‌య‌మై ఆయ‌న మాట్లాడుతూ.. “ఈ సుంకాల ప్రభావం ఎంత వరకు కనిపించింది చెప్పలేను.. కానీ రష్యాతో మా చ‌ర్చ‌కు ముందడుగు ప‌డింది” అని ట్రంప్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. మాస్కో చమురు దిగుమతిదారులపై పెనాల్టీలు మాత్రం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

35
రష్యా శాంతికి ఒప్పుకుంటే..

ర‌ష్యా కాల్పుల‌ను విర‌మిస్తే భార‌త్‌పై సుంకాలు త‌గ్గిస్తారా అని ఓ జ‌ర్న‌లిస్ట్ అడిగిన ప్ర‌శ్న‌కు ట్రంప్ బ‌దులిస్తూ.. “రష్యా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తే, భారత్‌పై ఉన్న సుంకాలు తగ్గే అవకాశముంది” అని ట్రంప్ చెప్పుకొచ్చారు. కానీ తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని, ఇప్పటికైతే భారత్ 50 శాతం సుంకాలు చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

45
పుతిన్‌తో ప్రత్యేక రాయబారి భేటీ

ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ ఈ వారం మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి కీలక చర్చలు జరిపారు. ఈ భేటీలో కాల్పుల విరమణ, శాంతి ఒప్పందం, ఇతర ఆర్థిక పరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. పుతిన్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం.

55
త్రైపాక్షికచర్చలకు ట్రంప్ సిద్ధం

వచ్చే వారం ట్రంప్ ఉక్రెయిన్ సమస్యపై త్రైపాక్షిక చర్చలకు సిద్ధమవుతున్నారు. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ఉక్రెయిన్ నేత జెలెన్‌స్కీ మాత్రమే పాల్గొననున్నట్టు వైట్ హౌస్ అధికార ప్రతినిధి కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ఈ చర్చల్లో ఇతర యూరోప్ దేశాలకు స్థానం ఉండదని స్పష్టం చేశారు. ట్రంప్ ఈ యుద్ధానికి శాశ్వత ముగింపు తెచ్చేందుకు తాను అన్ని దశల ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆమె చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories