రష్యాలో ఇటీవల అరుదైన ప్రకృతి వైపరిత్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే రష్యాలో అత్యధిక తీవ్రతతో భూమి కంపించి యావత్ ప్రపంచాన్ని కలవరపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇది సునామీని సృష్టించి భారీ ప్రమాదానికి కారణం అవుతుందని శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు భావించారు... దీంతో రష్యాతో పాటు జపాన్, అమెరికా వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. కానీ అదృష్టవశాత్తు సునామీ రాలేదు... దీంతో తీరప్రాంత ప్రజలు సురక్షితంగా ఉన్నారు.
ఈ భూకంపం ప్రభావమో లేక సహజంగానే చోటుచేసుకుందో గానీ రష్యాలో మరో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఇది కూడా భూకంపం మాదిరిగానే ప్రపంచాన్ని మరీముఖ్యంగా శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. వందల ఏళ్లుగా నిద్రాణ స్థితిలో ఉన్న అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలింది. ప్రస్తుతం కిలోమీటర్ల ఎత్తులో మంటలు ఎగిసిపడుతూ లావా ఎగజిమ్ముతోంది.
DID YOU KNOW ?
రష్యాలో భూకంపం.. ఈ దేశాల్లో సునామీ వార్నింగ్
ఇటీవల రష్యాల్లో భూకంపం సంభవించింది... దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.8 గా నమోదయ్యింది. దీని ప్రభావంతో జపాన్, హవాయి. ఈక్వెడార్ దేశాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
25
భారీ అగ్నిపర్వతం పేలుడు
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. శతాబ్దాల తరబడి నిద్రాణస్థితిలో ఉన్న క్రాషెన్నినికోవ్ (Krasheninnikov) అగ్నిపర్వతం అట్టడుగు నుండి భారీ శబ్దం చేస్తూ హఠాత్తుగా లావా జ్వాలలను వెదజల్లింది. దీంతో ఈప్రాంతమంతా ఎరుపెక్కింది.
క్రొనత్స్కీ రిజర్వ్ (Kronotsky Reserve) ప్రాంతంలో ఉన్న ఈ అగ్నిపర్వతం నుంచి దట్టమైన పొగలు 6 కిలోమీటర్ల (3.7 మైళ్ల) ఎత్తుకు ఎగసినట్టు స్థానిక సిబ్బంది వెల్లడించారు. రష్యా మీడియా విడుదల చేసిన చిత్రాల్లో ఆకాశంలోకి పొగలు ఎగిసిపడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
35
లావా ప్రవాహం
''అగ్నిపర్వత లావా తూర్పు దిశగా పసిఫిక్ మహాసముద్రం వైపు కదులుతోంది. దాని దారిలో ఎలాంటి జనావాసాలు లేవు. నివాస ప్రాంతాల్లో ఎక్కడా బూడిద పడినట్టు నమోదు కాలేదు'' అని కమ్చాట్కా అత్యవసర సేవల శాఖ పేర్కొంది.
అయితే తాజాగా మరో భూకంగా రష్యాలో సంభవించిందని... దీని తీవ్రత 7.0 గా గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే 600 ఏళ్లుగా అచేతనంగా ఉన్న అగ్నిపర్వత విస్ఫోటనానికి కారణమై ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ భూకంపంతో కమ్చత్కాలోని మూడు ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశాలున్నాయని భావించి హెచ్చరికలు కూడా జారీ చేాశారు. అయితే కొద్దిసేపటికే రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ ఈ హెచ్చరికలను ఉపసంహరించింది.
55
600 ఏళ్ల తర్వాత ఆగ్నిపర్వతం పేలుడు
కమ్చట్కా ప్రాంతంలోని అగ్నిపర్వత 600 ఏళ్లక్రితం పేలిందని రష్యా చెబుతోంది. ఈమేరకు కమ్చట్కా వోల్కానిక్ ఎరప్షన్ రెస్పాన్స్ టీమ్ హెడ్ ఓల్గా గిరినా తెలిపారు. కానీ అమెరికాలో ఉన్న స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్స్ గ్లోబల్ వల్కానిజం ప్రోగ్రామ్ మాత్రం ఈ అగ్నిపర్వతం చివరిసారి 1550లో (ఇది 475 సంవత్సరాల క్రితం) పేలిందని చెబుతోంది. ఈ గణాంకాల మధ్య ఉన్న తేడా కారణం ఏమిటన్నది ఇప్పటికీ స్పష్టంగా లేదు.