Health Benefits of Cycling: ఈ మధ్యకాలంలో చాలామంది హెల్త్, ఫిట్నెస్ పై దృష్టి పెడుతున్నారు. తమ ఆరోగ్యం గురించి కొంత సమయం కేటాయిస్తున్నారు. అందులో కొందరూ సైక్లింగ్ చేస్తున్నారు. రోజూ 15 నిమిషాల సైక్లింగ్ చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
Cycling Benefits: ప్రతి ఏడాది జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహిస్తారు. శారీరక దృఢత్వం, ఆరోగ్యానికి సైక్లింగ్ చాలా మంచిది. ఇది శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఆ సైక్లింగ్ ప్రయోజనాలు తెలుసుకుందాం.
25
గుండె ఆరోగ్యాన్ని
మన శరీరంలో గుండె కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సైక్లింగ్ ఒక అద్భుతమైన మార్గం. రోజూ సైక్లింగ్ చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే.. రక్త ప్రసరణను మెరుగుపరుచుకోవచ్చు.
35
వారికి అద్భుతమైన వ్యాయామం
బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం. సైక్లింగ్ శరీరంలో అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కాళ్లు, పిక్కలు, తొడల భాగాలలోని కండరాలు బలంగా మారుతాయి.
సైక్లింగ్ వల్ల మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపడుతుంది. ఇది శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అదనంగా.. మంచి నిద్రను పొందడంలో సైక్లింగ్ సహాయపడుతుంది.
55
వారికి సైక్లింగ్ మంచి ఎంపిక
సైక్లింగ్ ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. వాకింగ్ దీర్ఘకాలంలో ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ మంచి ఎంపిక.