వంకాయల్ని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే ఈ కూరగాయలు ప్రతి సీజన్ లో లభిస్తాయి. కానీ వీటిని వానాకాలంలో మాత్రం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం..
గుత్తివంకాయ, వంకాయ పచ్చడి, మసాలా వంకాయ, వంకాయ కూర వంటి రకరకాల కూరలను వంకాయ కూరలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. నిజానికి వంకాయ మంచిదే. దీనిలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయినా కానీ ఈ కూరగాయను వానాకాలంలో మాత్రం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.
25
వంకాయ ఆరోగ్య ప్రయోజనాలు
వంకాయలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు పుష్కలగా ఉంటాయి. ఈ కూరగాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపర్చడానికి సహాయపడతాయి. అలాగే దీనిలో మెండుగా ఉంటే ఫైబర్ కంటెంట్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
ముఖ్యంగా మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ కూరగాయ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు దీన్ని తింటే గుండె జబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
35
వర్షాకాలంలో వంకాయను ఎందుకు తినకూడదు?
వంకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నా వానాకాలంలో మాత్రం తినొద్దని ఆరోగ్యనిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు. ఎందుకంటే ఈ కూరగాయను వానాకాలంలో తింటే జీర్ణవ్యవస్థ సరిగ్గా పనిచేయదట. ఎందుకంటే వంకాయ వేడి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని తింటే ఎసిడిటీ, గ్యాస్, చికాకు, స్కిన్ అలెర్జీ వంటి సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముందే వర్షాకాలంలో మన జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో వంకాయను తింటే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఉన్న సమస్యలు కాస్త ఎక్కువ అవుతాయి.
ఇకపోతే వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వంకాయలకు పురుగు విపరీతంగా పడుతుంది. దీన్ని పోగొట్టేందుకు పురుగుల మందులను వాడతారు. ఇలాంటి వాటిని తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది.
55
వర్షాకాలంలో వంకాయను ఎవరు తినకూడదు?
దురద, అలెర్ఈ వంటి సమస్యలతో బాధపడేవారు వంకాయలను తినకపోవడమే మంచిది. ఎందుకంటే వంకాయ ఈ సమస్యలను మరింత పెంచుతుంది. ఇకపోతే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలున్నవారు కూడా వంకాయను తినొద్దు. ఎందుకంటే దీనిలో ఉండే సోలనిన్ అనే మూలకం ఈ సమస్యను రెట్టింపు చేస్తుంది. నిపుణుల ప్రకారం.. గర్భంతో ఉన్నవారు కూడా వంకాయ కూరను తినకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయాన్ని ఉత్తేజపరుస్తుంది.