Weight Loss: ఎండాకాలంలో బరువు తగ్గడం చాలా ఈజీ, కానీ ఈ తప్పులు మాత్రం చేయద్దు
ఎండాకాలంలో బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? నిజానికి ఈ సీజన్ లో బరువు తగ్గడం చాలా ఈజీ. కానీ, మీరు కొన్ని రకాల తప్పులు చేయకపోతేనే బరువు తగ్గగలరు.
ఎండాకాలంలో బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? నిజానికి ఈ సీజన్ లో బరువు తగ్గడం చాలా ఈజీ. కానీ, మీరు కొన్ని రకాల తప్పులు చేయకపోతేనే బరువు తగ్గగలరు.
బరువు తగ్గాలి అనుకునేవారికి ఎండాకాలం బెస్ట్ టైమ్ అని చెప్పొచ్చు. ఈ సమయంలో ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తీసుకోవడం తగ్గిస్తాం. ఇది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. అందుకే ఎక్కువ మంది బరువు తగ్గడానికి సమ్మర్ నే సెలక్ట్ చేసుకుంటారు. అయితే.. ఈ సీజన్ లో వెయిట్ తగ్గాలి అంటే కొన్ని రకాల తప్పులు మాత్రం చేయకూడదు. మరి, ఆ తప్పులేంటో చూద్దాం..
సమ్మర్ లో మనం దాహం చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆ దాహం తీర్చుకోవడానికి వాటర్ తాగడంతోపాటు.. సమ్మర్ డ్రింక్స్ చాలా తాగుతూ ఉంటారు. ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూస్ లు కూడా పండ్ల రసాలే కదా తాగితే మంచిదే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ, అవి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ప్యాకేజ్డ్ డ్రింక్స్ పై మనకు తెలీకుండానే కేలరీలు, షుగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక గ్లాసు జ్యూస్ లో 200 నుంచి 300 కేలరీలు ఉండొచ్చు. ప్రతిరోజూ దీనిని తాగడం వల్ల మీ కేలరీల కౌంట్ పెరిగిపోయి.. మళ్లీ బరువు పెరుగుతారు. కావాలంటే మీరు కొబ్బరి నీళ్లు తాగొచ్చు.
తరచుగా ప్రజలు బరువు తగ్గడానికి సలాడ్ తినడానికి ఇష్టపడతారు. అయితే.. సలాడ్ లో మీరు ప్రోటీన్ ని కూడా భాగం చేసుకోకపోతే.. వెంటనే మళ్లీ ఆకలి వేస్తుంది. దీంతో.. మళ్లీ ఏదో ఒకటి తినేస్తాం. దాని వల్ల కూడా బరువు పెరిగిపోతారు. అందుకే.. సలాడ్ తో పాటు ప్రోటీన్ కూడా భాగం చేసుకోవాలి. దీనికి బదులు.. మీరు ఏం తిన్నా సమతుల్య భోజనం తీసుకోవాలి. అప్పుడు ఈజీగా బరువు తగ్గుతారు.
సాధారణంగా సమ్మర్ లో తీపి, నూనెలో వేయించిన వేడి వేడి ఆహారాలు తినడానికి ఇష్టపడరు. అలాంటి క్రేవింగ్స్ తక్కువగా ఉంటాయి. దీని బదులు డీటాక్స్ క్రాష్ డైట్స్ తీసుకోవడం ప్రారంభిస్తారు. అటువంటి డైట్‌లో, ప్రజలు తరచుగా జ్యూస్ లేదా నిమ్మరసం మొదలైనవి తీసుకుంటారు. కానీ అలాంటి డైట్స్ కొవ్వును తగ్గించవు, కానీ కండరాలు ,నీటిని తగ్గిస్తాయి. ఈజీగా బరువు తగ్గినట్లే అనిపిస్తుంది. కానీ.. కొద్ది రోజులకే మళ్లీ బరువు పెరిగిపోతారు. జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. హార్మోన్ల సమస్యలు కూడా వస్తాయి.అందుకే.. అలా కాకుండా.. మంచి హెల్దీ డైట్ ని ఎంచుకోవాలి. బరువు తగ్గడం ఆలస్యం అయినా కూడా ఫలితం బాగుంటుంది.